England: ఇంగ్లాండ్.. శీతల ప్రాంతంగా పేరు పొందిన ఈ దేశం సూర్యుడి దెబ్బకు విలవిలలాడుతోంది. 40 కి మించి డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బయట అడుగుపెట్టిందుకే భయపడిపోతున్నారు. పెరిగిన ఎండల వల్ల చాలావరకు పారిశ్రామిక సంస్థలు పని వేళలను కుదించాయి. ఇక ఐటి విభాగంలో పని చేసే వారంతా ఇంటి వద్ద నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో లండన్లో అంతంత మాత్రమే ఉండే ఏసీల కొనుగోళ్ళు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. దీంతో అక్కడి కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి.
సైనికులు కింద పడ్డారు
పెరిగిన ఎండల వల్ల సామాన్య ప్రజలే కాదు బ్రిటన్ సైనికులు కూడా నరకం చూస్తున్నారు. కింగ్ చార్లెస్_3 ఎదుట 17న నిర్వహించనున్న “ట్రూపింగ్ ది కలర్” కార్యక్రమంలో భాగంగా ప్రిన్స్ విలియం సమక్షంలో సన్నాహక కవాతు నిర్వహించారు. ఎండ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సన్నాహక కవాతులో పాల్గొన్న సైనికుల్లో ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. సైనికులు ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించి పాల్గొన్నప్పటికీ తీవ్ర అలసటకు గురయ్యారు. ఒక సైనికుడైతే కింద పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మిగతా సైనికులు పరుగున వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎండలు పెరిగిపోతున్నాయి
ఇతర ప్రాంతంగా పేరు పొందిన బ్రిటన్ లో ఎండలు ఈ స్థాయిలో పెరగడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డకట్టే మంచులో, వణికించే చలిలో ఉన్ని దుస్తులు వేసుకుంటూ గడపాల్సిన బ్రిటన్ ప్రజలు.. బయటికి వచ్చేందుకే జంకుతున్నారు అంటే ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో మహా అయితే 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కాదు. కానీ ఈ సంవత్సరం అది ఏకంగా 40 డిగ్రీల వరకు నమోదు అవుతుంది. దీంతో ఆ పెరిగిన ఎండలను అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు నరకం చూస్తున్నారు. ఇక లండన్ మధ్య ప్రాంతంలో యాపిల్ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగితే వీటి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈసారి ఎండలు బాగా నమోదవుతున్న నేపథ్యంలో ఆపిల్ తోటలు అంతగా కాపు కాసే అవకాశాలు లేవని అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర శీతల పంటలైన పియర్స్, వాటర్ ఆపిల్, అవకాడో వంటి వాటి దిగుబడిపై కూడా ఎండలు తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అక్కడి వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిపోతున్న కాలుష్యం
ఇంగ్లాండ్ ఈ స్థాయిలో మండిపోవడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న కాలుష్యం. ఇటీవల పారిశ్రామిక సంస్థలు వెలువరిస్తున్న కాలుష్య కారకాలు వాతావరణాన్ని నాశనం చేస్తున్నాయి. దీనికి తోడు ధ్రువపు ప్రాంతంలో మంచు విపరీతంగా కరుగుతున్న నేపథ్యంలో.. అది ఇంగ్లాండ్ వాతావరణం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అక్కడ అడవుల నరికివేత కూడా పెరుగుతోంది. ఇది కూడా ఎండలు పెరిగేందుకు కారణమవుతోంది.
Temperatures have passed 30C in London today, overwhelming some soldiers who took part in a military parade alongside Prince Williamhttps://t.co/McrUFliY2F pic.twitter.com/KAYXloNTvV
— ITV News (@itvnews) June 10, 2023