BiggBoss 9 Telugu : ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్స్ లో కాస్త వెరైటీ గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు మాస్క్ మ్యాన్ హరీష్. ఇతని అసలు పేరు హరిత హరీష్, కానీ మాస్క్ మ్యాన్ గానే ఆడియన్స్ కి ఎక్కువగా గుర్తుండిపోయాడు. అగ్నిపరీక్ష షో లో అద్భుతంగా గేమ్స్ ఆడడంతో పాటు, చక్కని వాదోపవాదనలు వినిపించడం జనాలను ఆకర్షించింది. కానీ ఎప్పుడైతే ఆయన హౌస్ లోకి అడుగుపెట్టాడో, అప్పటి నుండి ఆడియన్స్ కి ఇతను అంటేనే చిరాకు కలిగింది. ఇతని నుండి ఏదైనా కంటెంట్ వస్తుందేమో అని రెండు మూడు వారాలు నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు ఆడియన్స్ సేవ్ కూడా చేశారు. కానీ ఎలాంటి కంటెంట్ బయటకు రాకపోవడం తో ఇక హౌస్ లో ఈయన ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు.
ఒక బలమైన కంటెస్టెంట్, టాప్ 5 వరకు వచ్చే సత్తా ఉన్నప్పటికీ కూడా కేవలం నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం బాధాకరమే. మాస్క్ మ్యాన్ హరీష్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా లేకపోవడం తో ఇతనికి సినిమా అవకాశాలు రావడం కూడా కష్టం. స్టార్ మా ఛానల్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ఇతను కనిపించడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే బిగ్ బాస్ బజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనికి శివాజీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ బజ్ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగింది. శివాజీ మరియు హరీష్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. హరీష్ లో ఎలాంటి మార్పు లేదు, లోపల ఉన్నప్పుడు ఆయన ఎలాంటి ధీటైన సమాదానాలు చెప్పేవాడో, బజ్ ఇంటర్వ్యూ లో కూడా అలాంటి సమాధానాలే చెప్పాడు.
ఎంత సేపు నీ సొంత డబ్బా కొట్టుకోవడమేనా?, జనాలు భరించలేకనే నిన్ను బయటకు గెంటేశారు అంటూ శివాజీ అంటాడు. దానికి హరీష్ కౌంటర్ ఇస్తూ ‘మన గురించి మనమే డప్పు కొట్టుకోవాలి సార్. మిగిలిన కంటెస్టెంట్స్ లాగా నాకేమి పీఆర్ లు లేరు. నా గురించి నేనే చెప్పుకోవాలి కదా మరీ’ అంటూ చెప్పుకొచ్చాడు. సంజన గారు మీరు శుభ్రంగా లేరని అనడం, దానిని మీరు అంత పెద్ద సమస్య గా మార్చి చూపడం అవసరమా అని శివాజీ అడగ్గా, దానికి హరీష్ సమాధానం చెప్తూ ‘మంచి ఉంటే బయటకు చెప్పాలి..చెడు ఉంటే చెవిలో చెప్పాలి’ అని అనగానే, ఇది చిరంజీవి గారి డైలాగ్ అని అంటాడు శివాజీ. అప్పుడు హరీష్ నా డైలాగ్ నే చిరంజీవి గారు వాడుకున్నారేమో అనే అర్థం వచ్చేలా మాట్లాడుతాడు. ఈ బజ్ ఇంటర్వ్యూ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది, చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి.
