Tomiko Ituka: ఈ రోజుల్లో ఒక 50 ఏళ్లు జీవించడమే కష్టం. ప్రస్తుతం ఉన్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది 50 నుంచి 60 ఏళ్లకే మరణిస్తున్నారు. అలాంటిది జపాన్‌కి చెందిన ఓ వృద్ధురాలు ఏకంగా 116 ఏళ్లు జీవించింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు అయిన టోమికో ఇటూకా డిసెంబర్ 29న మరణించింది. 1908న మే 23న ఒసాకాలో జన్మించిన ఇటూకా హైస్కూల్ సమయం నుంచే అన్నింట్లో రాణించేది. స్కూల్ చదివే సమయంలో వాలీబాల్ ప్లేయర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె 3,067 మీటర్ల ఎత్తు ఉన్న మౌంట్ ఆన్‌టేక్ పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించింది. చాలా యంగ్ ఏజ్‌లోనే వివాహం చేసుకున్న ఈమెకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచిన మహిళగా ఈమె గిన్నిస్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుంది.
టోమికో ఇటూకా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. ఈమెకు అరటి పండ్లు, క్యాల్పిస్ అని పిలిచే పెరుగు రుచి ఉన్న జపనీస్ పానీయం అంటే చాలా ఇష్టమట. 117 ఏళ్ల మరియా బ్రాన్యాస్ మరణించిన తర్వాత ఆమె గత సంవత్సరం అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ప్రపంచ సూపర్ సెంటెనేరియన్ ర్యాంకింగ్స్ లిస్ట్‌లో ఆమె అగ్రస్థానంలో ఉంది. గత సంవత్సరం ఇటూకా తన పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన భర్తతో కలిసి ఇటూకా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భర్త 1979లో మరణించడంతో ఒంటరిగానే జీవితాన్ని కొనసాగించింది. అప్పటి నుంచి తన ఇటుకా ఒక్కరే కుటుంబాన్ని పోషించారు. మొత్తం నలుగురు పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. వారిని మంచి పొజిషన్‌కి తీసుకొచ్చారు.
ఈ జనరేషన్‌లో వందేళ్లకు పైగా జీవించడం అంటే చాలా కష్టం. అయితే ఇటూకా ఆ కాలం మనిషి కాబట్టి ఎక్కువ కాలం జీవించింది. సాధారణంగా జపాన్ దేశ ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. మిగతా దేశాలతో పోలిస్తే జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వీటి ఆరోగ్య విధానాలు అన్ని కూడా అందరితో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. వీరు ఆరోగ్యానికి మేలు చేసే, పోషకాలు ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అందుకే ఇక్కడి ప్రజలు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు. ఇక్కడి ప్రజల చర్మ సౌందర్యం కూడా అందంగా ఉంటుంది.