Cloth wash: ప్రస్తుతం రోజుల్లో మహిళలు చాలా బిజీగా ఉంటున్నారు. ఉద్యోగాలు, ఇంట్లో పని, కుటుంబ పోషణ ఇలా కనీసం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు. వీరికి డైలీ ఇవే పనులతో అయిపోతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు పనుల్లో నిమగ్నం అయిపోతారు. అయితే కొందరికి పగటి పూట సమయం లేకపోవడం వల్ల కొందరు మహిళలు రాత్రి సమయాల్లో బట్టలు వాష్ చేస్తుంటారు. పగటి పూట పిల్లలు, కుటుంబంతో సమయం లేక అందరూ నిద్రపోయిన తర్వాత మహిళలు దుస్తులు వాష్ చేస్తారు. అయితే ఇలా రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదని, కుటుంబంలో సమస్యలు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. రోజంతా ఉద్యోగం చేసి రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత మురికి బట్టలను వాష్ చేయడం అశుభం అని పండితులు అంటున్నారు. మరి దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి? రాత్రి సమయాల్లో ఎందుకు వాష్ చేయకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం మురికి దుస్తులను కేవలం పగటి సమయాల్లో మాత్రమే వాష్ చేయాలి. రాత్రి సమయంలో మురికి దుస్తులను వాష్ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. ఎంత పని ఉన్నా కూడా రాత్రి సమయాల్లో అసలు దుస్తులు వాష్ చేయకూడదు. ఒకవేళ స్నానం చేసి అలా వాష్ చేసిన కూడా ఆ దుస్తులను బయట ఆరవేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా దుస్తులను రాత్రి సమయాల్లో వాష్ చేసి ఆరవేయడం వల్ల ఆనందం, శ్రేయస్సుకు ఆటంకం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు బట్టలు ఉతకాలని పండితులు అంటున్నారు. ఇలా సూర్యరశ్మిలో దుస్తులను ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి అంతా కూడా పోతుంది. అలాగే సూర్యరశ్మికి అందులోని క్రిములు అన్ని కూడా నాశనం అవుతాయి. ఇలాంటి దుస్తులను ధరించినప్పుడు చర్మ సమస్యలు రావు. అదే సూర్యరశ్మి లేకుండా ఆరే దుస్తులను ధరించడం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సూర్యరశ్మిలో ఆరబెట్టిన దుస్తులను ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే రాత్రి సమయాల్లో దుస్తులు ఉతకడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే సూర్యరశ్మి తగలక దుస్తుల్లో క్రిములు ఉండిపోతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే బట్టలను కేవలం ఉదయం సమయాల్లో మాత్రమే వాష్ చేయాలి. రాత్రి చేస్తే ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నష్టం చేసిన పనులు సక్రమంగా కాకపోవడం వంటివన్ని కూడా జరుగుతాయి. ఇంట్లో సంతోషం లేకుండా ఎప్పుడూ కూడా గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా రాత్రి సమయాల్లో అసలు దుస్తులు ఉతకవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.