America : అగ్రరాజ్యం అమెరికాలో కొత్త తరహా స్కామ్ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అమెరికాలో ప్రతి ఒక్కరికీ కారు కామన్ గా ఉంటుంది. అలాగే అక్కడ ప్రతి కారుకు ఇన్స్యూరెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. దీంతో కొంత మంది కేటుగాళ్లు ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొత్త తరహా స్కామ్ ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. కావాలని యాక్సిడెంట్లు చేసి ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేస్తున్నారు. ఇటీవల అలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొందరు కేటుగాళ్లు ఓ కియా కారును ఫాలో అవుతారు. ఆ కారును క్రాస్ చేసి పెద్ద యాక్సిడెంట్ కు ప్లాన్ చేస్తారు. కియా కారు ముందుకు పోనిచ్చి సడన్ బ్రేక్ వేస్తారు. కానీ సదరు కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండి బ్రేకులు అప్లై చేస్తాడు. అయినా కానీ కారు ముందున్న మహీంద్ర కారు రివర్స్ గేర్ వేసి వేగంగా వెనుక ఉన్న కియా కారును గుద్దుతారు. అంతే కాకుండా కారులో ఉన్న వారంతా దిగి ఏం తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు. సదరు కియా కారుకు కెమెరా ఉండడం వల్ల వారు చేసిన పని వెలుగులోకి వచ్చింది. అదే గనుక కారుకు కెమెరా లేకపోతే వారు ఈ కియా కారు డ్రైవర్ పై రుబాబు చూపించవచ్చు. డబ్బులు కూడా డిమాండ్ చేయవచ్చు. అందుకే ప్రతి కారు యజమాని కారుకు ఫ్రంట్ బ్యాక్ కెమెరాలను అమర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఫ్లోరిడాలో దశలవారీ ప్రమాదాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను అధికారులు గుర్తించారు . నేషనల్ ఇన్సూరెన్స్ క్రైమ్ బ్యూరో ప్రకారం అమెరికా అంతటా జరుగుతున్న కారు ప్రమాదాలలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వీటిలో ఎక్కువ శాతం ఆటో భీమా కోసం జరుగుతున్నవే అని తేలింది. ఆటో భీమా కోసం కొంతమంది వ్యక్తిగతంగా గాయాలు చేసుకుని క్లెయిమ్ చేస్తున్నారు. భీమా డబ్బును తీసుకోవడానికి వారంతా నకిలీ కారు ప్రమాదాలను సృష్టిస్తున్నట్లు తేలింది. అలాంటి ప్రమాదాలకు కొన్ని పేర్లు పెట్టారు.
“స్వూప్ స్క్వాట్” పథకంలో రెండు కార్లు ఉంటాయి. ఒకటి బాధితుడి కారు ‘స్వూపర్’ ముందు దూసుకుపోతుంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది, ఇది వెనుక వైపు ఢీకొనడానికి కారణమవుతుంది. మరొకటి బాధితుడు ‘స్క్వాటర్’ పక్కన వారు లేన్‌లను మార్చకుండా అడ్డుకుంటుంది. కారు వెనుకకు వెళ్లకుండా ఉండండి. “స్వూప్” కారు సాధారణంగా అనుభవజ్ఞుడైన డ్రైవర్ నడుపుతారు. అయితే “స్క్వాట్” కారు సాధారణంగా సహచరులతో నిండి ఉంటుంది, వారు కేవలం తక్కువ వేగంతో ఢీకొంటారు. ఇన్సురెన్స్ కు మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించి గాయపడ్డారని క్లెయిమ్ చేస్తారు
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: This is a new scam in america where people are causing accidents and claiming insurance money
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com