Homeఅంతర్జాతీయంMost populous cities in the world : ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్...

Most populous cities in the world : ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్ 10 నగరాలు ఇవే.. హైదరాబాద్ స్థానం ఎంత అంటే?

Most populous cities in the world : ప్రపంచ వ్యాప్తంగా జనాభా ఏటా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో మాత్రమే జననాల రేటు తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో మరణాల రేటు కూడా తక్కువగా ఉండడంతో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువ జనాభా తగ్గుతోంది. ఇలాంటి దేశాల్లో చైనా, జపాన్, రష్యా కూడా ఉన్నాయి. ఈ దేశాలు జనాభా పెరుగుదల కోసం పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. అయినా జననాల రేటు పెరగడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే.. రాబోయే రోజుల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపం వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎక్కువగా నగరాలు, పట్టణాల్లో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకకపోవడం, రోజు వారీ ఆదాయం తక్కువగా ఉండడం, వ్యవసాయం, ఇతర గ్రామీణ పనులు చేసేవారు తగ్గడం తదితర కారణాలతో చాలా మంది నగరాలకు వలస పోతున్నారు. దీంతో నగర జనాభా గణనీయంగా పెరుగుతోంది. 2024 లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన పది నగరాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో మన నగరాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసా?

టోక్యో…
జపాన్‌ రాజధాని టోక్కో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది. 2024 లెక్కల ప్రకారం.. ఇక్కడ 37.1 మిలియన్ల జనాభా ఉంది.

ఢిల్లీ..
భారత రాజధాని ఢిల్లీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో నగరం. ఇక్కడ 33.8 మిలియన్ల మంది జీవనం సాగిస్తున్నారు.

షాంౖఘై..
చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మూడో నగరం. ఇక్కడ 29.9 మిలియన్ల జనాభా ఉంది.

ఢాకా..
మన పొరుగున ఉన్న ఇస్లామిక్‌ దేశం బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం ఇక్కడ 23.9 మిలియన్ల జనాభా ఉంది. ప్రపంచంలో వేఘంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఢాకా ఒకటి.

సావోపాలో..
బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరం సావో పాలో. ఈ నగరం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఐదో ప్లేస్‌లో ఉంది. 2024 లెక్కల ప్రకారం.. ఇక్కడ 22.8 మిలియన్ల మంది నివాసితులు ఉన్నారు.

కైరో..
ఈజిప్ట్‌ రాజధాని కైరో. ఇక్కడ కూడా జనాభా చాలా ఎక్కువ. ప్రపంచంలో ఎక్కు జనాభా కలిగిన నగరాల్లో కైరో ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ 22.6 మిలియన్ల మంది నివాసం ఉంటున్నారు.

మెక్సికో సిటీ..
మెక్సికో నగరం ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశాల్లో ఏడో స్థానంలో ఉంది. ఇక్కడ 2024 లెక్కల ప్రకారం.. 22.5 మిలియన్ల జనాభా ఉంది.

బీజింగ్‌..
ఇక చైనాలోని షాంఘై జనాభాలో మూడో స్థానంలో ఉండా, బీసింగ్‌ 8వ స్థానంలో ఉంది. ఇక్కడ 22.2 మిలియన్నల జనాభా నివాసం ఉంటోంది.

ముంబై..
భారత ఆర్థిక రాజధాని ముంబై కూడా ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 9వ స్థానంలో ఉంది. ఇక్కడ 21.7 మిలియన్ల జనాభా నివసిస్తోంది. ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, ముంబై 9వ స్థానంలో ఉంది. టాప్‌ టెన్‌లో మన నగరాలు రెండు ఉన్నాయి.

ఒసాకా..
జపాన్‌ రాజధాని టోక్యో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండగా, ఆ దేశంలోని ఒసాకా నగరం పదో స్థానంలో ఉంది. ఇక్కడ 19 మిలియన్ల జనాభా ఉంటుంది. జపాన్‌కు అత్యంత కీలకమైన నగరం ఒసాకా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular