Homeఅంతర్జాతీయంJustin Trudeau : ఇండియా పై ఆరోపణలు.. ముఖం చూపించలేక భారతీయులతో పండగలు.. కెనడాలో ఓట్ల...

Justin Trudeau : ఇండియా పై ఆరోపణలు.. ముఖం చూపించలేక భారతీయులతో పండగలు.. కెనడాలో ఓట్ల కోసం ట్రూడో పాట్లు

Justin Trudeau : భారత్‌ అంటే తనకు గిట్టదు అన్నట్లు.. భారత్‌తో తెగ ఇబ్బందులు పడుతున్నట్లు.. భారత్‌ను ప్రపంచ వేదికపై దోషిగా నిలబెట్టాలని పనిచేస్తున్నారు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు ట్రూడో. భారత్‌ ఏదో తప్పు చేసినట్లు.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలుచేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలోని మీడియాకు లీకులు ఇస్తున్నారు. కెనడా చర్యలకు భారత్‌ ఎదుగుదలను ఓర్వలేని వ్యక్తులు, నేతలు, దేశాలు సమర్థిస్తున్నాయి. కెనడాను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. ఇండియాకు తాను బద్ధ శత్రువును అన్నట్లు వ్యవహరిస్తున ట్రూడో.. కెనడాలోని భారతీయులతో మాత్రం సఖ్యతగా ఉంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం విభేదాలు క ఓరుకోవడం లేదు. దీంతో భారతీయ పండుగలను సైతం జరుపుకుంటున్నారు. భారతీయులతో కలిసి వేడుకల్లో పాల్గొంటున్నారు. తాజాగా కెనడాలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ట్రూడో ఖలిస్థానీ ఉనికిపై తొలిసారి స్పందించారు. భారత్‌ ఆరోపణలను అంగీకరించారు. తమ దేశంలో ఖలిస్థానీ ఉనికి ఉన్నా.. అందరూ ఖలిస్థానీ మద్దతుదారులు కాదని తెలిపారు. ఇటీవల అక్కడి పార్లమెంట్‌ హాల్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత సంతతి మంత్రుల ఆధ్వర్యంలో..
కెనడా పార్లమెంట్‌ హాల్‌లో దీపావళి వేడుకలను భారత సంతతి మంత్రుల ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని ట్రూడో పాల్గొన్నారు. కెనడాలో అనేక మంది ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. అయితే వారంతా సిక్కు మతానికి ప్రాధినిధ్యం వహిస్తున్నట్లు కాదన్నారు హింస, అసహనం, బెదిరింపులు, విభజనకు తావులేదన్నారు. ఆయా వర్గాల సంప్రదాయాలను గౌరవిస్తామన్నారు. భారత ప్రాదేశిక సమగ్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

భారత్‌పై అక్కసు..
ఇదిలా ఉంటే.. భారత్‌పై ట్రూడో మరోసారి అక్కసు వెల్లగక్కారు. మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఎంతో మంది కెనాడాలో ఉన్నా.. వారంతా హిందూ కెనడియన్లందరికీ ప్రాతినిధ్యం వహించరని తెలిపారు. ఇదిలా ఉంటే.. సిక్కు వేర్పాటు వాదులు ఇటీవలే హిందూ ఆలయంపై దాడి చేశారు.కాన్సులర్‌ శిబిరంపై కొందరు దాడి చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు జెండాలతో వచ్చి వీరంగం సృష్టించారు. తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది భారత్‌. ఇక్కడి ప్రభుత్వం హిందువులకు భద్రత కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular