https://oktelugu.com/

Peaceful countries : ప్రపంచంలో ప్రశాంతమైన పది దేశాలు ఇవే..!

ప్రపంచంలో రెండు కీలక యుద్ధాలు జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌పై దాడులు చేస్తోంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ వెయ్యి రోజులుగాకొనసాగుతోంది.

Written By: Raj Shekar, Updated On : November 20, 2024 9:30 pm
Peaceful countries

Peaceful countries

Follow us on

Peaceful countries : ప్రపంచం మూడో ప్రపపంచ యుద్ధం వైపు పయనిస్తోంది. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోంది. హమాస్‌ లక్ష్యంగా యుద్ధం మొదలు పెట్టిన ఇజ్రాయోల్‌.. తర్వాత హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై దాడులు చేసింది. ప్రస్తుతం ఇరాన్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇకరెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికీ ముగియలేదు. ఇటీవలే ఈ యుద్ధం ఉధృతమైంది. ఈ యుద్ధంలోకి ఉక్రెయిన్‌ తరఫున అమెరికా, నాటో దేశాలు ఉండగా, రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా రంగంలోకి దిగింది. అక్కడ ఇరాన్, ఇక్కడ రష్యా అణు ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. ఉత్తర కొరియా కూడా అణ్వస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇలా యుద్ధాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ – 2024 విడుదలైంది. క్రైం రేటు తక్కువగా ఉండి, ప్రశాంతంగా ఉండే దేశాల జాబితాను విడుదల చేసింది.

ప్రశాంతమైన పది దేశాలు ఇవే..
గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రపంచంలో పది ప్రశాంతమైన దేశాలు ఏంటో చూద్దాం. ఏ దేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.

ఐస్‌లాండ్‌..
యూరప్‌ దేశం అయిన ఐస్‌లాండ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా పీస్‌ ఇండెక్స్‌ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

ఐర్లాండ్‌
మరో యూరప్‌ దేశమైన ఐర్లాండ్‌ కూడా ప్రశాంతమైన దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. క్రైం రేటు ఆధారంగా దీనికి పీస్‌ ఇండెక్స్‌ సెకండ్‌ ప్లేస్‌ కేటాయించింది.

ఆస్ట్రియా…
యూరప్‌కే చెందిన మరో చిన్న దేశం ఆస్ట్రియా పీజ్‌ ఇండెక్స్‌ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్‌…
ఆస్ట్రేలియా ఖండంలోని న్యూజిలాండ్‌… పీస్‌ ఇండెక్స్‌ లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎవరితోనూ ఈ దేశానికి వైరం లేకపోవడం ప్లస్‌ పాయింట్‌.

సింగపూర్‌..
ఆసియా దేశం, అభివృద్ధి చెందిన దేశం అయిన సింగపూర్‌.. పీస్‌ ఇండెక్స్‌ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక్కడ కూడా క్రైం రేటు చాలా తక్కువ.

పోర్చుగల్‌..
యూరప్‌ దేశమైన పోర్చుగల్‌.. కూడా ప్రపంచంలో ప్రశాంతమైన దేశంగా గుర్తింపు పొందింది. పీస్‌ ఇండెక్స్‌ లిస్ట్‌లో ఆరో స్థానంలో నిలిచింది.

స్విట్జర్లాండ్‌..
ఇక ధనిక దేశమైన స్విట్టర్‌లాండ్‌ కూడా పీస్‌ ఇండెక్స్‌లో ఏడో స్థానం దక్కింది. భారతీయులు నల్ల ధనం దాచేది ఈ దేశంలోనే.

డెన్మార్క్‌..
ప్రపంచంలో అందమైన దేశంగా గుర్తింపు ఉన్న డెన్మార్క్‌.. ప్రశాంతమైన పది దేశాల జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకుంది. ఇటీవలే డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా విశ్వసుందరిగా నిలిచింది.

స్లోవేనియా..
చిన్న దేశమైన స్లోవేనియా కూడా ప్రపంచంలో ప్రశాంతమైన దేశాల జాబితాలో నిలిచింది. ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకుంది.

మలేషియా..
ఆసియా దేశం మలేషియా పీస్‌ ఇండెక్స్‌ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. చిన్నదేశమే అయినా.. ఇక్కడ కూడా క్రైం రేటు తక్కువ. ఎవరితోనూ మలేషియాకు తగాదాలు లేవు.