https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులకు లక్ష్మీ కటాక్షం.. ఊహించని లాభాలు..

ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అవసరమైన పనిని మాత్రమే చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 21, 2024 / 07:33 AM IST

    Horoscope Today(4)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు చంద్రుడు సింహ రాశిలో ప్రయాణం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వృషభం, కర్కాటక రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మేషంతో సహా మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సాగుతాయి. కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి.

    వృషభరాశి:
    పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. స్నేహితుల ద్వారా సాయం పొందుతారు.

    మిథున రాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.

    కర్కాటక రాశి:
    సోదరుల సలహా మేరకు కొన్ని వ్యాపార కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు గోప్యంగా ఉంచాలి లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితుల నుంచి డబ్బు సాయం అందుతుంది.

    సింహా రాశి:
    ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబంలో కొన్ని వివాదాలు ఎదురవుతాయి. భాగస్వాముల నుంచి కొత్త ప్రతిపాదనలు వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

    కన్యరాశి:
    కొన్ని పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    తుల రాశి:
    ఉద్యోగులు అధిక ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రణళికలు వేస్తారు.

    వృశ్చిక రాశి:
    ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అవసరమైన పనిని మాత్రమే చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

    ధనస్సు రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. చట్టపరమైన వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబ ఆస్తి విషయంలో శుభవార్త వింటారు.

    మకర రాశి:
    జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సలహా తీసుకుంటారు.

    కుంభ రాశి:
    శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    మీనరాశి:
    ఉద్యోగులు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఇతరుల వద్ద అప్పులు చేయకుండా ఉండాలి. ప్రణాళిక ప్రకారం కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.