Unhappy Countries: ప్రపంచంలో అందమైన దేశాలు.. పర్యాటకులను ఆకర్షించే దేశాలు.. ఆర్థికంగా సంపన్నమైన దేశాల గురించి తరచూ వింటుంటాం. వివిధ సంస్థలు ఈమేరకు ప్రపంచ దేశాలకు ర్యాంకులు కూడా ఇస్తున్నాయి. చివరకు నేరాలు ఎక్కువగా జరిగే దేశాలు కూడా ఉన్నాయి. అయితే సంతోషం కనుచూపు మేర కూడా లేకుండా.. తీవ్ర అసంతృప్తి(Un satisfaction)తో కొట్టు మిట్డాడుతున్న దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి.
ప్రపంచంలో ఆనంద స్థాయిలలో వైవిధ్యాలను నిర్ణయిచండానికి ఆరు(Six) కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రపంచ సంతోష నివేదిక. ఈ అంశాల్లో సమాజిక మద్దతు, ఆరోగ్యం, ఆదాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవడం తదితర అంశాల ఆధారంగా జాబితా రూపొందిస్తుంది. వాటన్నింటిలో వెనుకబడిన అత్యల్ప సంతోషకరమైన దేశాలే అసంతృప్పత దేశాలు. ఈ జాబితాలో ఏయే దేశాలు ఉన్నాయో చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్..
ప్రపంచ సంతోష సూచికలో 137 దేశాలలో అట్టడుగున ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ తక్కువ ఆయుర్దాయంతోపాటు వివిధ సమస్యలు ఇందుకు కారణం. గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ పోరాటాలు, పౌరుల శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేశాయి.
లెబనాన్..
ఆఫ్ఘనిస్తాన్ తర్వాత లెబనాన్ అత్యంత తక్కువ తసంతోషకరమైన ఘనతను కలిగి ఉంది. ఈ దేశంలో అత్యంత సంతోషకరమైన దేశాలకంటే ఆయుద్ధాం ఎక్కువగా ఉ న్నా.. సామాజిక, రాజకీయ సవాళ్లు, ఆర్తిక అస్థిరత అసంతోషానికి కారణం.
సియెర్రా లియోన్..
ప్రపంచంలో మూడో అత్యల్ప సంతోషకరమైన దేశం ఆఫ్రికాలోని సియెర్రా లియోన్. తక్కువ సంతోష సూచికకు దోహదపడే ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక అసమానలతు, రాజకీయ అస్థిరత, సామాజిక అశాంతి ప్రభావితం చేస్తున్నాయి.
జింబాబ్వే..
ప్రపంచ సంతోష నివేదికలో నాలుగో స్థానంలో ఉంది జింబాబ్బే. యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, సియోర్రాలియోన్‌తో పోలిస్తే జింబాబ్వే కొంచె అనుకైలమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. దేశం అల్లకల్లోల చరిత్ర, కొనసాగుతున్న సవాళ్లతో పోరాడుతుంది. ఆ దేశ జనాభా శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..
ఈ దేశంలో తక్కువ సంతోషం ఉన్న దేశాల్లో ఐదో స్థానంలో ఉంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సుదీర్ఘ చరిత్ర సంఘర్షణ, రాజకీయ తిరుగుబాటు, నిరంకుశ పాలన, బలవంతంగా స్థానభ్రంశం తదితర సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ అంశాల అశాంతికి సూచికలు.
బోట్స్‌వానా..
ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ వంటి దేశాలకన్నా బోట్స్‌వానా కొంచెం మెరుగు. ఇక్కడ స్పాక్ష స్థిరత్వం ఉన్నా.. సామాజిక శ్రేయస్సులో వెనుకబడింది. ఇది సంతోషాన్ని ప్రభావితం చేస్తుంది.
మలావి..
వేగంగా పెరుగుతున్న జనాభా, సారవంతమైన భూమి, నీటిపారుదల లేకపోవడం వంటి సవాళ్లు ఎదుర్కొంటోంది మలావి. ఈ నేపథ్యంలోనే అక్కడి పౌరులు ఆనందంగా ఉండం లేదు. అసంతృప్తితో జీవనం సాగిస్తున్నారు.
కొమొరోస్..
ఈ దేశంలో తరచూ తిరుగుబాటు ప్రజలను సంతృప్తిగా ఉండనివ్వడం లేదు. ఇక్కడ ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈ దేశం అసంతృప్తి వాతావరణంగా తారాస్థాయిలో ఉంది.
టాంజానియా..
ప్రధాన సంతోష సూచికలలో తక్కువ మార్కులతో టాంజానియా కూడా అసంతృప్త దేశాల జాబితాలో ఉంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇది దేశ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
జాంబియా..
అత్యల్ప సంతోషకరమైన దేశాల జాబితాలో చివర పదో స్థానంలో ఉన్న దేశం జాంబియా. దీనిని సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ అని పిలుస్తారు. ఇక్కడ ఉపాధి, రాజకీయం అనిశ్చితి, సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. అవే అసంతృప్తికి కారణం.
12 స్థానంలో భారత్..
ఇక అసంతృప్తి, తక్కువ సంతోషం ఉన్న దేశాల జాబితాలో మన దేశం కూడా ఉంది. మన దేశం ర్యాంకు 12. అంటే భారతీయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కూడా అసమానతలే అసంతృప్తికి ప్రధాన కారణం. కుల, మతాలు కూడా అసంతృప్తికి కారణం.