Russia America Oil Tanker: తన జోలికి వస్తే ఎంతటి దేశమైనా సరే పడుకోబెట్టే స్థాయి రష్యాది. తమ జోలికి రాకున్నా సరే.. గెలికి వాసన చూసే తీరు అమెరికాది. ఆర్థికంగా అమెరికా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. వనరులు సమీకరించుకోవడంలో రష్యాకు తిరుగులేదు. యూరప్ యూనియన్ మొత్తం ఏకమైనా సరే.. అమెరికా సపోర్ట్ చేస్తున్న సరే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం సాగిస్తూనే ఉంది. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా వెళ్తూనే ఉంది.
అమెరికా ఇటీవల వెనిజుల మీద దాడి చేసింది. ఆ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకువచ్చింది. అయితే ఉన్నట్టుండి అమెరికా రష్యా మీద పడింది. ఉరుములేని పిడుగు మాదిరిగా అమెరికా నిప్పు రాజేసింది. చమురే ఎందుకు ప్రధాన కారణం. అమెరికా బుధవారం రెండు చమురు నౌకలను నిర్బంధించింది. ఇవి వెనిజులా దేశానికి చెందిన పని అమెరికా ఆరోపిస్తోంది. ఇందులో ఒక నౌకను ఉత్తర అట్లాంటిక్, మరో నౌకను కరేబియన్ సముద్ర జలాల్లో అమెరికా దళాలు పట్టుకున్నాయి.
ఈ రెండు చమురు నౌకలను పట్టుకున్న తర్వాత అమెరికా అధికారికంగా వివరాలను వెల్లడించింది. అయితే అకస్మాత్తుగా ఇందులోకి రష్యా ప్రవేశించింది. ఆ రెండు నౌకలు సమవేనని రష్యా ప్రకటించింది. దీంతో ఉన్నట్టుండి వివాదం ఏర్పడింది. ముందుగా ఈ నౌకలలో ఒకటి మాత్రమే తమదని రష్యా చెప్పింది.. ఆ తర్వాత రెండు మావేనని రష్యా వెల్లడించింది. ” అమెరికా సముద్రంలో దొంగతనానికి పాల్పడింది. దొంగ చాటుగా వాటిని రక్షించడానికి జలాంతర్గాములను పంపింది. ఇదంతా కూడా అమెరికా చేస్తున్న నిబంధనల ఉల్లంఘన అని” రష్యా ప్రకటించింది.
ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అమెరికా పట్టుకున్న వాటిల్లో ఒక నౌక పేరు బెల్ల 1, రెండో నాక పేరు సోఫియా. బెల్ల నౌకను కొద్దిరోజులుగా అమెరికా దళాలు వెంటాడాయి. చివరికి ఉత్తరా అట్లాంటిక్ సముద్రంలో పట్టుకున్నాయి. ఇలా పట్టుకునే క్రమంలో అమెరికా దళాలకు బ్రిటన్ దళాలు సహాయం చేశాయి. ఈ నౌకను పట్టుకున్న తర్వాత బ్రిటన్ కూడా కీలక ప్రకటన చేసింది. రెండు చమురు నౌకలు వెనుజులా ప్రాంతంలోనే లంగరు వేశాయని బ్రిటన్ ప్రకటించింది. అంతేకాదు ఈ రెండు నౌకలు కూడా చమురును హిజబుల్లా ఉగ్ర ముఠాకు సరఫరా చేస్తున్నాయని ఆరోపించింది.
బెల్ల నౌకపై అమెరికా 2024 లోనే నిషేధం విధించింది.” “గత డిసెంబర్ లోనే కరేబియన్ దీవులలో ఆ నౌకను నిలువరించడానికి అమెరికా ప్రయత్నాలు చేసింది. అయితే ఒడ్డుకు చేరడానికి బెల్ల నౌక ను నడిపేవారు ఒప్పుకోలేదు. చివరికి ఆ నౌక తన పేరును మారినేర గా మార్చుకుంది. డాక్ యార్డ్ మీద రష్యా జెండాను ఎగురవేసిందని” హోలాండ్ ఒక ప్రకటన చేసింది.
బెల్లా నౌక విషయంలో రష్యా మాత్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఇది తమ చమురు నౌకాని చెప్పింది. అమెరికా తన జలాలకు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో తమ నౌకను నిర్బంధించిందని రష్యా ప్రకటించింది. సోఫియా కూడా తమ నౌకే అని వెల్లడించింది. అమెరికా తీరు పట్ల రష్యా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చేసిన పని పట్ల ఆగ్రహంగా ఉన్న రష్యా.. మునుముందు దూకుడు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ దీనికి అమెరికా గనుక దీటుగా బదులిస్తే.. అప్పుడు పరిణామాలు వేరే విధంగా ఉంటాయని తెలుస్తోంది. అమెరికా ఆ నౌకలను వదిలిపెడుతుందా? రష్యా తమ నౌకలను వెనక్కి తెచ్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
⚡️BREAKING AND UNUSUAL
Russia threatens to sink American ships!
Aleksei Juravlev (Deputy Chairman of the Defense Committee in the Duma):
“We must respond militarily.. Hit them with torpedoes and sink their ships!
America is living in the euphoria of power after the… pic.twitter.com/buc9CFb6iJ— RussiaNews (@mog_russEN) January 7, 2026