Donald Trump: అమెరికా భూతల స్వర్గం కావచ్చు.. అవకాశాలను అపారంగా ఇవ్వచ్చు.. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ భారీగా ఉండొచ్చు.. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండకపోవచ్చు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విషయంలో బరాబర్ సూట్ అయింది. దెబ్బకు ఆయన థింకింగ్ మారిపోయింది. మాంద్యం వేళ ఆయన ఆలోచన ఇండియా వైపు మళ్ళింది.. ఏకంగా ఆయన చేత ఐదువేల కోట్ల పెట్టుబడి పెట్టిస్తోంది.

రియాల్టీ సామ్రాజ్య విస్తరణకు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు స్థిరాస్తి వ్యాపారం ఉంది.. ఆయన నిర్వహణలోని “ద ట్రంప్ ఆర్గనైజేషన్” వచ్చేయడాది 5వేల కోట్ల పెట్టుబడితో ఎనిమిది సూపర్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించనుంది.. ఇందులో భాగంగా మూడు నుంచి ఐదు ప్రాజెక్టులు బెంగళూరు, లుథియానా, చండీగఢ్ నగరాల్లో నిర్మితం కానున్నాయి.. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ట్రైబెకా డెవలపర్స్ అనే కంపెనీ తో కలిసి ద ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టులు నిర్మించనుంది. ఈ మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల కోసమే 2,500 కోట్ల వరకు ఖర్చు చేస్తామని ట్రైబెకా డెవలపర్స్ ప్రమోటర్లు చెబుతున్నారు. ట్రంప్ బ్రాండ్ పేరుతోనే ఈ హై ఎండ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తామని వివరిస్తున్నారు.
భారత్ పై దృష్టి ఎందుకంటే
ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ భారత్ మాత్రమే. ప్రపంచ సంస్థలు మొత్తం కూడా ఇందుకోసమే మన దేశం వైపు చూస్తున్నాయి. పైగా గత దశాబ్ద కాలంలో భారతీయుల ఆర్థిక స్థితిగతుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అమెరికా వెలుపల భారత్ మాత్రమే అత్యంత సురక్షితమైన దేశమని ట్రంప్ భావిస్తున్నారు. పైగా ద ట్రంప్ ఆర్గనైజేషన్ కు భారత రియాల్టీ మార్కెట్ అతిపెద్దది.. ఇక్కడ మార్కెట్ పై దృష్టి పెట్టేందుకుగాను గత పదేళ్లుగా డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అమెరికాలో తనతో కలిసి చదువుకున్న కల్పేష్ మెహతా ప్రమోట్ చేసిన ట్రైబెకా డెవలపర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఇప్పటికే పూణే, ముంబై, కోల్ కతా, గురుగ్రామ్ ప్రాంతాల్లో 26 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ విల్లాలు, ఆఫీసు భవనాలు నిర్మించింది. కొత్తగా బెంగళూరు, హైదరాబాద్, లుధియానా, చండీగఢ్ నగరాలపై దృష్టి పెడుతోంది.

అమెరికాలో అనిశ్చిత పరిస్థితులు
అమెరికాను కాదని ట్రంప్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం వెనుక పెద్ద కథే ఉంది.. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక మాంద్యం కోరలు చాచింది. ఉద్యోగాలు పోతున్నాయి.. ధరలు మండిపోతున్నాయి.. పైగా ప్రభుత్వం అంతకంతకు పొదుపు చర్యలు పాటిస్తోంది. ఎంతటి పెద్ద కార్పొరేట్ సంస్థ అయినప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లితే దానికి కూడా నూకలు చెల్లుతాయి.. ప్రస్తుతం ట్రంప్ కంపెనీల పరిస్థితి కూడా అదే.. అందుకోసమే భారత్ మార్కెట్లో గతంలో ఎన్నడు లేని విధంగా భారీగా పెట్టుబడులు పెడుతున్నది..