Viral Video : చైనాలో వస్తువుల ఉత్పత్తి ఎక్కువ. అక్కడ తయారీ పరిశ్రమ బలంగా ఉంటుంది. తయారీ విషయంలో విస్తృతంగా పని చేసే చైనా.. నాణ్యతను మాత్రం పట్టించుకోదు. అందువల్లే చైనా వస్తువులకు బయట మార్కెట్లో చులకన భావం ఉంటుంది. అయినప్పటికీ చైనా తన తీరు మార్చుకోదు. అలా మార్చుకుంటే అది చైనా ఎందుకవుతుంది. వస్తువుల విషయంలోనే ప్రపంచాన్ని మోసం చేస్తోంది అనే పేరు ఉన్న చైనా.. చివరికి జంతువుల విషయంలోనూ తన ధోరణి మార్చుకోలేదు. పైగా ప్రపంచాన్ని మాయ చేసింది. ఆ మాయలోనే గొప్ప దేశమనే పేరును తగిలించుకుంది. చివరికి చైనా చేస్తున్న పనిని “పెటా” కూడా అభినందించింది. కానీ అసలు విషయం తెలియడంతో చైనా నకిలీ బుద్ధి ప్రపంచానికి మరోసారి తెలిసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డ్రాగన్ దేశాన్ని ఏకిపడేస్తున్నారు. ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ చైనా దేశం ఏం చేసిందంటే..
పాండాలను సంరక్షిస్తున్నామని చెప్పి..
ఈ భూమ్మీద అంతరించిపోయే క్షీరదాల జాబితాలో పాండాలు కూడా ఉన్నాయి. అటు చింపాంజీ, ఇటు కోతి లక్షణాలు కలిగి ఉండే పాండాలు భిన్నమైన జంతువులు. భూమ్మీద జీవించి ఉన్న అత్యంత అరుదైన క్షీరదాలలో పాండాలు ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ జాతి అత్యంత వేగంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో పాండాలను సంరక్షిస్తున్నామని ప్రపంచం ముందు చైనా కలరింగ్ ఇచ్చింది. అంతేకాదు మీడియాలో కూడా వాటి దృశ్యాలను టెలికాస్ట్ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చైనా దేశం చేస్తున్న ప్రయత్నం పట్ల ప్రశంసలు వ్యక్తం అయ్యాయి. చివరికి పెట్టాలాంటి జంతువుల పరి రక్షణ సంస్థ కూడా చైనా చేస్తున్న పనిని అభినందించింది. కాని చివరికి చైనా పాండాలను రక్షించలేదని.. కేవలం రంగు పూసి మాయ చేసిందని ప్రపంచానికి తెలిసింది.
కుక్కలకు రంగులు పూసి..
కుక్కలకు పాండాల మాదిరిగా రంగులు పూసి చైనా జంతు ప్రదర్శనశాలలో ఉంచింది. అయితే ఒక సందర్శకుడికి అనుమానం రావడంతో అతడు వీడియో తీశాడు. సాధారణంగా పాండాలు నెమ్మదిగా కదులుతాయి. తోటి జంతువులను చూడగానే నెమ్మదిగా స్పందిస్తాయి. అంతేతప్ప నాలుకతో సొల్లు కార్చవు. అయితే చైనా శాన్వీ అనే జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఆ పాండాలు నాలుక బయటపెట్టి సొల్లు కార్చడం.. వేగంగా అడుగులు వేయడం.. కుక్కల మాదిరిగానే వాసన, మనుషులను పసిగట్టడంతో ఆ సందర్శకుడికి అనుమానం కలిగి వీడియో తీశాడు. దానిని అసలు మీడియాలో పోస్ట్ చేశాడు. ” కుక్కలకు రంగులు వేసి పాండాలు అని చెబుతున్నారు. చైనా అంటేనే నకిలీ.. ఇది మరోసారి నిజమైందని” అతడు ఆ వీడియో పోస్ట్ చేస్తూ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.. చైనా చేసిన పని పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ జంతు ప్రదర్శనశాలలో పాండాల మాదిరిగా ఉన్న కుక్కలు చైనాలోని స్పిట్జ్ రకానికి చెందినవని న్యూయార్క్ పోస్ట్ ఉటంకించడం విశేషం.
Glitch in the Matrix: China zoo forced to admit the truth after one of their “pandas” started panting and barking. The Shanwei zoo admits they painted dogs white and black to make them look like pandas. pic.twitter.com/5SWDlpOSqB
— SynCronus (@syncronus) September 19, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More