Donald Trump Cabinet: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 300లకుపైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించి ఎన్నికయ్యారు. ఆయన పార్టీ రిపబ్లికన్ కూడా యూఎస్ కాంగ్రెస్‌లో ఘన విజయం సాధించింది. యూఎస్ కాంగ్రెస్ అంటే భారత పార్లమెంటు లాంటిది. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటింస్, సెనెట్ ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే లోక్‌సభ లాంటింది. సెనెట్ అంటే రాజ్య సభ లాంటింది. లోక్‌సభ లాంటి హౌస్‌ఆఫ్ రిప్రజెంటేవీస్ 300లకుపైగా గెలుచింది రిపబ్లికన్ పార్టీ. ఈ నేపథ్యంలో ట్రంప్ బాధ్యతల స్వీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ తన ప్రభుత్వంలోని కీలక పదవులను భర్తీ చేస్తున్నారు. ఇందులో భారత్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న నలుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు.
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా…
గుజరాత్ మూలాలు ఉన్న కశ్యప్‌ను ట్రంప్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారత సంతతి అమెరికన్ అయిన కశ్యప్‌ను ఎంపిక చేశారు. ఆయన అమెరికాలో క్యాష్ పటేల్‌గా గుర్తింపు పొందారు. కాష్ పలేట్ తల్లిదండ్రులు మొదట ఉగాండడాలో ఉండేవారు. అక్కడ ఈడీ అమీన్ పాలనలో ప్రబలిన అరాచకాలను భరించలేక 1970లో అమెరికాలోని లాంగ్ ఐలాండ్‌లో స్థిరపడ్డారు. కాష్ పటేల్ 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జన్మించారు. 2005లో పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్(టీచర్ ఆఫ్ లా) పొందారు. అనంతరం ఫ్లోరిడాలో ఎనిమిదేళ్లు పబ్లిక్ డిఫెండర్‌గా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్య, మారణాయుధాలకు సంబంధించిన నేరాలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులను వాదించారు. 2014లో అమెరికా న్యాయ శాఖ జాతీయ భ్రదతా విభాగంలో ట్రయల్ అటార్నీగా చేరారు. ఆ సమయంలోనే జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్‌కు సేవలందించారు. 2017లో హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ కౌనిసల్‌గా నియమితులయ్యారు. హౌస్ పర్మినెంట్ సెలక్ట్ కమిటీలో స్టాఫర్‌గా పనిచేశారు. ఆసమయంలోనే ట్రంప్ దృష్టిలో పడ్డారు. ఆయన బృందలో చేరారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు వీలుగా రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై జరిపిన దర్యాప్తును రిపబ్లికన్ల తరఫున వ్యతిరేకించడంలో కీలకంగా వ్యవహరించారు. ట్రంప్‌పై బైడెన్ సర్కార్ తీరును నిరసిస్తూ గవర్నమెంట్ గ్యాంగ్‌స్టర్స్ అనే పుస్తకాన్ని ట్రంప్ సింహంగా చిత్రీకరించి ద ప్లాట్ ఎగైనెస్ట్ ద కింగ్ అనే పుస్తకాన్ని రాశారు. ట్రంప్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆయనతోనే ఉన్నారు.
డోజ్ కో చైర్మన్‌గా రామస్వామి..
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వివేక్ రామస్వామి. తమిళనాకుడు చెందిన ఈయన అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత, మరియు రాజకీయ వ్యక్తి. అతడు 1985లో అమెరికాలో జన్మించాడు, కానీ ఆయన భారతీయ వంశానుబంధం కలిగి ఉంటారు. ఆయన తల్లిదండ్రులు భారతదేశం నుండి అమెరికా వచ్చినవారు. వివేక్ రామస్వామి రావుట్ సైన్సెస్ అనే జీవవైవిధ్య మరియు బయోఫార్మస్యూటికల్ సంస్థను స్థాపించారు, ఇది వైద్య పరిశోధన మరియు ఔషధాల అభివృద్ధిలో నిపుణమైన సంస్థ. అంతేకాక, ఆయన 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పరమార్థి కోసం తన పేరును ముందుకు పెట్టాడు. వేక్, ఇన్‌క్ అనే పుస్తకాలు రాశాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడ్డారు. అయితే హిందువు అయిన వివేక్‌కు రిపబ్లికన్లు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో ఉపాధ్యక్షుడు అవుతారని భావించారు. కానీ ఆ పదవి రాకపోయినా కీలకమైన కొత్త పోస్టును సృష్టించి ఆ బాధ్యతను ప్రపంచ కుబేరడు ఎలాన్ మస్క్‌తో కలిసి అప్పగించారు. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) కో చైర్మన్‌గా నియమించారు. కొత్త ప్రభుత్వంలో డోజ్ చాలా కీలకం. ప్రభుత్వ వృథాను ఇది నియత్రిస్తుంది.
డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్..
తులసి గబ్బార్డ్ అమెరికన్ రాజకీయ నాయకురాలు. ఈమెకు భారతీయురాలు కాదు. కానీ, ఈమె తల్లిదండ్రులు హిందూ మతం స్వీకరించారు. అందుకే ఆమెకు తులసీ అని పేరు పెట్టారు. హవాయ్ రాష్ట్రం నుండి అమెరికా ప్రతినిధి సభకు ఎన్నికైనవారు. ఆమె 1981లో అమెరికాలో జన్మించారు. తులసి గబ్బార్డ్‌ను ప్రత్యేకంగా ఆమె రాజకీయ ప్రయాణం, మరియు అమెరికాలోని వైవిధ్యమైన సమాజాల పట్ల ఆమె దృష్టితో గుర్తిస్తారు. తులసి గబ్బార్డ్ 2013 నుండి 2021 వరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్ (ప్రతినిధి సభ) సభ్యురాలిగా పనిచేశారు. తాజాగా మరోమారు ఎన్నికయ్యారు. ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు కాగా, తన రాజకీయ మార్గదర్శకతలో కొన్ని విశేషమైన ఆలోచనలు మరియు మార్గాలను ప్రదర్శించారు. ముఖ్యంగా, ఆమె విదేశాంగ విధానాలు మరియు సామాజిక సమస్యలపై తన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఎన్నిల ముందు డెమొక్రటిక్ పార్టీని వీడి ట్రంప్‌కు మద్దతు తెలిపారు. దీంతో ట్రంప్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్‌గా నియమించారు.
ఉపాధ్యక్షుడు..
అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈయన కూడా భారతీయుడు కాడు. కానీ, భారత సంతతికి చెందిన చిలుకూరి ఉష భర్త, ఆమె ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. వివేక్ రామస్వామి, చిలుకూరి ఉశ, జేడీ వాన్స్ అక్కడ ఒకే యూనివర్సిటీలో లా చేశారు. ఈ మసయంలోనే వీరు పరిచయం. ఉష, జేడీ వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాన్స్ దిగువ మధ్య తరగతికి చెందిన వ్యక్తి. ఇతను రచయిత. జేడీ వాన్స్ పూర్తి పేరు జేమ్స్ డ్యాన్ వాన్స్ 1984లో అమెరికాలో జన్మించాడు. హిల్‌బిల్లీ ఈగల్లీ అనే పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఈ పుస్తకం, వాణిజ్యంగా విజయవంతంగా ఉన్నప్పటికీ, వాడు తన వృద్ధి చెందిన ఆప్లిచినా ప్రాంతంలోని తన అనుభవాలను మరియు సామాజిక. ఆర్థిక పరిస్థితులను వివరించాడు. ఈ పుస్తకం ఆధారంగా 2020లో ఒక సినిమా కూడా రూపొందించబడింది. వాన్స్ 2022లో ఒహియో రాష్ట్రం నుండి òసెనెటరాగా పోటీ చేసి గెలిచారు. అతను రిపబ్లికన్ పార్టీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. అనూహ్యంగా రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.