https://oktelugu.com/

Srileela : దాని కోసం సినిమాలు పక్కన పెడుతున్న శ్రీలీల, మేటర్ తెలిస్తే షాక్ అవుతారు!

యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలు పక్కన పెట్టేస్తుందట. ప్రస్తుతం ఆమె ఫస్ట్ ప్రయారిటీ సినిమా కాదట. వరుస ఆఫర్స్ వస్తున్నప్పటికీ శ్రీలీల రిజెక్ట్ చేయడానికి కారణం ఆమె స్వయంగా చెప్పారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

Written By:
  • S Reddy
  • , Updated On : December 2, 2024 / 04:14 PM IST

    Srileela

    Follow us on

     Srileela :  టాలీవుడ్ లో మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్ శ్రీలీల. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. గత ఏడాది శ్రీలీల నుండి నాలుగు చిత్రాలు వచ్చాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూడు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే భగవంత్ కేసరి మూవీతో ఆమె హిట్ అందుకున్నారు. బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీలీల కీలక రోల్ చేసింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. 
     
    ప్రస్తుతం శ్రీలీల రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితే 75వ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. రాబిన్ హుడ్ సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక రవితేజ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై కొంత సందిగ్ధత నెలకొంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఖాళీ సమయాన్ని హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలకు కేటాయిస్తున్నట్లు సమాచారం. 
     
    తాజాగా శ్రీలీల పుష్ప 2 చిత్రంలో ఐటెం నెంబర్ చేసింది. కెరీర్లో ఫస్ట్ టైం ఆమె స్పెషల్ సాంగ్ లో నటించారు. అందుకు స్ట్రాంగ్ రీజన్ ఉంది. సినిమా విడుదలయ్యాక మీకు తెలుస్తుందని శ్రీలీల అన్నారు. కిస్సిక్ అనే ఈ ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీలీల భారీగా ఛార్జ్ చేసిందట. అయితే శ్రీలీలకు ఇబ్బడిముబ్బడిగా ఆఫర్స్ వస్తున్నాయట. అయితే ఆమె రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం. చాలా సినిమాలు రిజెక్ట్ చేస్తున్నారు, కారణం ఏమిటని అడగ్గా… చదువు కోసం అని ఆమె సమాధానం చెప్పారు. 
     
    గత ఏడాది శ్రీలీలకు అటెండెన్స్ సరిపోలేదట. అందుకే ఈ ఏడాది కాలేజ్ కి వెళ్లాలని, చదువు మీద దృష్టి పెట్టాలని ఆమె భావిస్తున్నారట. అందుకే కొన్ని సినిమాలు వదులుకున్నారని స్పష్టం చేశారు. శ్రీలీల ఎంబిబిఎస్ స్టూడెంట్. బెంగుళూరులో ఆమె చదువుతుంది. శ్రీలీల తల్లి డాక్టర్. ఆమె ఫేమస్ గైనకాలజిస్ట్. కూతురిని కూడా డాక్టర్ చేయాలని అనుకుంది. శ్రీలీల చదువుకుంటూనే..  హీరోయిన్ గా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. శ్రీలీల ఫైనల్ ఇయర్ లో ఉన్నట్లు సమాచారం.