Hez Bolla – Israel : హెజ్ బొల్లా మీద ఇజ్రాయిల్ వరుస దాడులు చేస్తోంది. కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. మొన్నటిదాకా రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సాగగా.. ఇప్పుడు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ – లెబనాన్ మధ్య భీకరమైన పోరు జరుగుతోంది.
లెబనాన్ లోనూ..
ఇన్నాళ్లపాటు హమాస్ – ఇజ్రాయిల్ మధ్య పోరు జరిగేది. ఇప్పుడు అది లెబనాన్ దేశానికి విస్తరించింది.. లెబనాన్ లో హెజ్ బొల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ బాంబులతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 400 మంది కి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడ్డారు. అయితే ఈ వైరానికి నాలుగు దశాబ్దాల క్రితమే బీజం పడింది. అందువల్లే ఈ రెండింటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గాజా ప్రాంతంలో..
గాజా ప్రాంతంలో హమాస్ – ఇజ్రాయిల్ సైన్యానికి యుద్ధం జరుగుతున్నప్పుడు..లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనికులపై హెజ్ బొల్లా దాడులకు పాల్పడింది. సరిహద్దు ప్రాంతాలలో క్షిపణులతో దాడులు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు దాడులు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇటీవల ఈ రెండిటి మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల పేజర్ల పేలుళ్లు, వాకీ టాకీ ల పేలుళ్లతో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
1980లో..
పాలస్తీనియన్ లిబరైజేషన్ ఆర్గనైజేషన్ (PLO) ను నిర్మూలించేందుకు 1980లో ఇజ్రాయిల్ లెబనాన్ పై దాడి చేసింది. లెబనాన్ రాజధాని బీ రూట్ నుంచి పీఎల్వో లో కొందరు నైట్ డ్యూటీ లో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై దాడులు చేశారు.. ఆ దాడుల్లో 91 మంది ఇజ్రాయిల్ అధికారులు దుర్మరణం చెందారు. షియా ఇస్లామిస్టులు ఈ ఘటనకు తామే కారణమని ప్రకటించారు. ఆ తర్వాత వారు హెజ్ బొల్లా గా మారారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ – హెజ్ బొల్లా మధ్య వైరం కొనసాగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యక్ష దాడులు చేసుకుంటున్నారు అయితే గత 40 ఏళ్లుగా ఈ యుద్ధం వల్ల ఇరుపక్షాలు చాలా నష్టపోయాయి. 1983 లో హెజ్ బొల్లా పురుడు పోసుకుంది. తొలినాళ్లల్లో బలాన్ని పెంచుకోవడానికి ఇరాన్ దేశంతో జతకట్టింది. ఇజ్రాయిల్ తో ఉన్న వైరం వల్ల ఇరాన్ కూడా హెజ్ బొల్లా తో అంటకాగడం మొదలుపెట్టింది. ఆర్థిక బలం, రాజకీయ బలంతో ఇజ్రాయిల్ దేశానికి హెజ్ బొల్లా పక్కలో బల్లెం లాగా మారింది. కోవర్టు, గెరిల్లా ఆపరేషన్ లతో లెబనాన్ సరిహద్దులు దాటిపోయి బీరూట్ లోని ఫ్రాన్స్, అమెరికా స్థావరాలపై 1980, 1990 మధ్యకాలంలో చాలాసార్లు దాడులు చేసింది. అయితే ఇరాన్ మాత్రమే కాకుండా అనేక దేశాలు హెజ్ బొల్లా కు మద్దతు ప్రకటిస్తున్నాయి.. హెజ్ బొల్లా కు దక్షిణ అమెరికాలోని చాలా దేశాలు ఆర్థికంగా అండదండలు అందిస్తున్నాయి.. మాదకద్రవ్యాల రవాణా, అక్రమంగా నగదు పంపిణీ వంటి వ్యవహారాలలో హెజ్ బొల్లా ఆ దేశాలకు సహకారం అందిస్తోంది. 1990 తర్వాత హెజ్ బొల్లా గ్రూప్ విస్తరించింది. అయితే ఈ గ్రూపు అధినేత అబ్బాస్ ఆల్ ముసావిని ని ఇజ్రాయిల్ దళాలు చంపేశాయి. దీనికి ప్రతీకారంగా అర్జెంటుగాలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం, యూదుల కమ్యూనిటీ కేంద్రంపై హెజ్ బొల్లా దాడి చేసింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దశలో ఇజ్రాయిల్ నిఘా విభాగం మొస్సాద్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ నేతలను చంపడం మొదలుపెట్టింది. హెజ్ బొల్లా అగ్ర నాయకులకు మరణశాసనం రాసింది. అయితే ఇన్ని జరిగినప్పటికీ హెజ్ బొల్లా మిల్ట్రీ కమాండర్ ఇమాద్ ముగ్నియే ను మాత్రం ఏమీ చేయలేకపోతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More