Homeఅంతర్జాతీయంDangerous Hotel : వామ్మో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్.. వెళ్తే తిరిగి వస్తామా!

Dangerous Hotel : వామ్మో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్.. వెళ్తే తిరిగి వస్తామా!

Dangerous Hotel :  ఇంట్లో ఫుడ్ తినడంతో పాటు బయట ఫుడ్‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. ఎంత ఇష్టంగా ఇంట్లో వండుకున్నా కూడా ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్లి తినాలని అనుకుంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కంటే బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. కొత్త కొత్తగా ఉండే రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్ తినాలని అనుకుంటారు. దీంతో మార్కెట్‌కి ఏదైనా కొత్త రెస్టారెంట్ వచ్చినా, లేకపోతే ఏదైనా ప్రత్యేకం అనిపించినా కూడా వాటికి వెళ్తుంటారు. దీంతో ఎక్కువ మంది రెస్టారెంట్ చూడటానికి కొత్తగా, స్పెషల్ ప్లేస్‌లో ఉంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా బీచ్ వ్యూలో ఉన్న హోటల్స్‌కి అయితే బాగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే బీచ్‌లోని చల్లని గాలులతో ఆస్వాదించవచ్చని భావిస్తారు. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన హోటల్స్‌తో పాటు అత్యంత ప్రమాదకరమైన హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అంత ప్రమాదకరమైన హోటల్ ఎక్కడ ఉంది? అసలు ఎందుకు ఈ హోటల్ ప్రమాదకరంగా మారింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నార్త్ కరోలినా తీరానికి 34 మైళ్ల దూరంలో ఫ్రైయింగ్ పాన్ టవర్ అనే ఓ హోటల్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హోటల్‌. అయితే ఈ హోటల్‌కి చేరుకోవాలంటే పడవలో వెళ్లడానికి కూడా అవకాశం లేదు. కేవలం విమానంలో మాత్రమే ఈ హోటల్‌కి చేరుకోవాలి. బీచ్ మధ్యలో ఉండే ఈ హోటల్ ప్రకృతి అందాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఎంతో అందంగా ఉండే ఈ ప్లేస్‌లో చాలా తినడానికి వెళ్తుంటారు. కానీ కాస్త భయంతోనే ఉంటారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మాత్రం ఇక పైకే. ఇక్కడ ఎన్నో ప్రమాదకరమైన జీవులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సొరచేపలు అధికంగా ఉన్నాయి. ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ అనేది ఒకప్పుడు కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్‌గా పనిచేసింది. అయితే ఇప్పుడు ఇది హోటల్‌గా మారింది. ఇక్కడికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్‌లో ఉంటే మాత్రమే సముద్ర అందాలను వీక్షించవచ్చు. ఎంతో సుందరంగా ఉంటాయి. ఈ టవర్‌లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటుంది.

ఈ ఫ్రైయింగ్ పాన్ టవర్ దగ్గరికి ఎక్కువగా సాహస ప్రియులు వెళ్తుంటారు. ఈ టవర్ పైకప్పుపై హెలిప్యాడ్, వాటర్‌ఫాయిల్ కెమెరాతో కూడిన సెటప్ కూడా ఉంటుంది. అందులో జరిగిన అన్ని విషయాలు కూడా ఆ సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అయితే రిచర్డ్ నీల్ 2010లో కోస్ట్ గార్డ్ లైట్ స్టేషన్ నుంచి టవర్‌ను హోటల్‌గా మార్చాడు. అప్పటి నుంచి అడ్వెంచర్ ప్రియులకు హాట్ స్పాట్‌గా మారింది. ఎక్కువ మందికి ఇక్కడికి వెళ్తుంటారు. ఈ హోటల్‌లో ఒక రోజు ఎవరైనా ఉండాలంటే దాదాపుగా రూ.42,268 ఖర్చు అవుతుంది. అయితే ఇందులో ఒక రోజు కంటే మూడు రోజుల ట్రిప్ నుంచి ప్రారంభమవుతుంది. మీకు నచ్చిన ప్యాకేజీలో వెళ్లవచ్చు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular