https://oktelugu.com/

Xi Jinping: మనిషివా.. మానవమృగానివా.. చైనా అధ్యక్షుడి ఘోరమైన ప్లాన్ తో దేశమంతా భయాందోళన

వెనుకటి కాలంలో హిట్లర్ చేసిన దురాఘతాల ను మనం పుస్తకాల్లో చదువుకున్నాం. నిజాం ప్రభువు చేసిన దారుణాలు చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకున్నాం. నేటి నవీన కాలంలో అలాంటివాళ్లు ఉండరు అని అనుకున్నాం. కానీ అదంతా తప్పు.. నేనున్నాక అలా అనుకోవడం తప్పు అని నిరూపిస్తున్నాడు అధ్యక్షుడు జిన్ పింగ్.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 30, 2024 / 08:40 AM IST

    Xi Jinping

    Follow us on

    Xi Jinping: 2012లో చైనాలో జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాడు. నాటి నుంచి పార్టీపై పట్టు బిగించాడు. వరుసగా అధికారంలోకి వచ్చేందుకు నిబంధనలు మొత్తం తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాడు. తనకు నచ్చని వారిని, తనకు గిట్టని వారిని, తను అంటే సహించని వారిని ఉక్కుపాదంతో తొక్కిపెట్టాడు. భవిష్యత్తు కాలంలో వారు తనకు వ్యతిరేకం కాకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో.. అన్ని చేశాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ను అందరూ తిచుకుంటారు గాని.. అంతకంటే మూర్ఖుడు జిన్ పింగ్.. చైనా అధ్యక్షుడు కావడం.. చైనా తో ప్రపంచ దేశాలు ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో జిన్ పింగ్ ను ఏమీ అనలేకపోతున్నాయి. ఒకవేళ చైనాతో ఆర్థిక లావాదేవీలు గనుక లేకపోయి ఉంటే ఈపాటికి జిన్ పింగ్ ను ప్రపంచ దేశాలు ఏం చేయాలో అవే చేసేవి.. నాడు కరోనాతో ప్రపంచ దేశాలు విమర్శలు ఎదుర్కొన్న చైనా.. నేడు మరో పని చేసి అంతకంటే ఎక్కువ చీత్కరింపులు చవిచూస్తోంది.

    200 జైళ్లు

    చైనాలో ఏం జరిగినా అత్యంత రహస్యం లాగే ఉంటుంది. అయితే ఈసారి చైనా చేస్తున్న రహస్య పని దాగలేదు. ఆ విషయాన్ని ప్రఖ్యాత CNN IBN ఛానల్ బయటపెట్టింది.. ఇంతకీ ఆ ఛానల్ బయటపెట్టిన విషయం ఏంటంటే.. చైనా దేశంలో దాదాపు 200 ప్రత్యేకమైన జైళ్లను అక్కడి ప్రభుత్వం నిర్మిస్తోంది. పేరుకు అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వీటిని వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. అసలు లక్ష్యం వేరే ఉంది. చైనా నిర్మిస్తున్న ఈ జైళ్లను లియుజు అని పిలుస్తారు. ఇందులోకి వచ్చేవారిని 6 నెలల వరకు బంధించి ఉంచుతారు. వారికి న్యాయ సాయం అందించరు. కుటుంబ సభ్యులను కలవలేకుండా చేస్తారు. ఇలా ఆరు నెలలపాటు వారిని జైళ్లళ్లో ఉంచుతారు.. అయితే చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. ఎందుకంటే గతంలో జిన్ పింగ్ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఉక్కు పాదాన్ని ప్రదర్శించారు. అయితే వారిపై తీసుకున్న చర్యలకు అవినీతిపై వ్యతిరేక ఉద్యమం అనే పేరు పెట్టారు. ఆ పేరుతో తనకు అసమ్మతిగా ఉన్న వర్గాన్ని మొత్తం జైల్లో వేశారు. అయితే ఇప్పటికే చైనాలో షుయాంగి అనే పేరుతో జైళ్లు ఉన్నాయి. అవి ఉండగానే లియుజు కేంద్రాలను చైనా ఏర్పాటు చేస్తున్నాడు విశేషం. ఈ కేంద్రాలలో 24 గంటల పాటు పోలీసులు పహారా కాస్తారు. అత్యంత ఆధునికమైన సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.ఈ కేంద్రాలలో అధికార కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాత్రమే కాకుండా సివిల్ అధికారులు, హై ప్రొఫైల్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 2017 నుంచి 24 వరకు 210 లియుజూ సెంటర్లలో ప్రభుత్వం నిర్మించింది. కొన్నిచోట్ల విస్తరించింది. ఇక్కడ బంధించిన వారిని సరిగ్గా నిద్ర కూడా పోనేకుండా ఇబ్బంది పెట్టేవారు. ఎటువంటి పని చెప్పకుండా 18 గంటల పాటు కూర్చుని ఉండాలని ఆదేశాలు జారీ చేసేవారు..