Imran Khan : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రికెటర్‌గా పాకిస్తాన్‌కు వరల్డ్ కప్(World Cup) అందించాడు. ఇక ప్రధానిగా దేశానికి పూర్తిస్థాయి పదవీకాలం పనిచేశారు. ఎప్పుడూ రాజకీయ అనిశ్చితి, సైనిక తిరుగుబాటు ఉన్న దేశంలో ఎక్కువకాలం పాలించిన నేతగా గుర్తింపు ఉంది. పార్టీని స్థాపించి.. పదేళ్లు కష్టపడి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాడు. అయితే పదవీ విరమణ తర్వాత తన పాలనలో జరిగిన అవినీతి అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా అరెస్ట్ అయ్యారు. కొన్ని కేసుల్లో ఇమ్రాన్‌కు ఉపశమనం లభించింది. కానీ, తాజాగా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్ దంపతులు దోషిగా తేలారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్లు(జీవితఖైదు), ఆయన భార్య బుప్రా బీఈకి ఏడేళ్ల జైలు శిక్షణు న్యాయస్థానం(Court) విధించింది. దీంతో ఇమ్రాన్ పీటీఐ పార్టీకి కోలోకోలేని దెబ్బ తగిలినట్లయింది.
అల్ ఖాదిర్ కేసులో…
పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్ ఖాదిర్ కేసులో ఆదేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులను కోర్టు దోషులుగా తేల్చింది. అడియాల జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ తుది తీర్పును న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా వెల్లడించారు. ఈకేసులో ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు, ఆయన భార్య బుప్రా బీబీకి వరుసగా 14 ఏళ్లు, 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇదే సమయంలో ఇమ్రాన్, బుప్రాకు రూ.10 లక్షలు, రూ.5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే 2024, ఫిబ్రవరి 27న ఇమ్రాన్‌ఖాన్ దంపతులపై నేరాభియోగాలు మోపింది కొత్త ప్రభుత్వం.
ఫౌండేషన్ ముసుగులో అక్రమాలు..
ఇమ్రాన్‌ఖాన్ దంపతులు అల్ ఖాదిర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్(Foundation) స్థాపించారు. 1996 నుంచి ఇది పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికోసం పనిచేస్తుంది. అయితే ఈ ఫౌండేషన్ చాటున అక్రమాలు జరిగినట్లు పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కేసు దాఖలు చేసింది. ఈ అక్రమంలో ఇమ్రాన్‌ఖాన్, అతని భార్య బుప్రాబీబీ నిందితురాలిగా చేర్చింది. బిలియన్ల రూపాయల విలువైన భూమిని, డబ్బును కాజేసినట్లు ఆరోపించింది. వీటిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. దీంతో ఇమ్రాన్ మరికొన్నేళ్లు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
పీటీఐపౌ నీలినీడలు..
ఇమ్రాన్‌ఖాన్‌కు జీవితఖైదు నేపథ్యంలో ఆయన స్థాపించిన పీటీఐ(PTI)పార్టీ నాయకత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల నాటికి అయినా ఇమ్రాన్ బయటకు వస్తారని పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ, తాజాగా 14 ఏళ్ల జైలు శిక్ష పడడంతో ఆయన బటయకు రావడం అనుమానంగానే మారింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇమ్రాన్‌కు బెయిల్ రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఇమ్రాన్‌ఖాన్ సెకండ్ ఇన్సింగ్స్ కూడా ముగిసినట్లే అన్న చర్చ జరుగుతోంది.