Homeఅంతర్జాతీయంJapan Airport Bomb Explosion: జపాన్‌ విమానాశ్రయంలో పేలిన అమెరికా బాంబు.. రెండో ప్రపంచ యుద్ధం...

Japan Airport Bomb Explosion: జపాన్‌ విమానాశ్రయంలో పేలిన అమెరికా బాంబు.. రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా నిర్ధారణ.. వీడియో వైరల్‌!

Japan Airport Bomb Explosion: జపాన్‌ రెండో ప్రపంచ యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన దేశం. రెండు అనుబాంబుల దాడికి గురైంది. ఇప్పటికీ అక్కడి ప్రజలపై అనుబాంబు ప్రభావం ఉంది. పుట్టబోయే పిల్లలపైనా ఎఫెక్ట్‌ పడుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో తాజాగా జపాన్‌ విమానాశ్రయంలో బాంబు పేలింది. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో పాతిపెట్టిన బాంబు ఇన్నాళ్లకు బుధవారం(అక్టోబర్‌ 2న)పేలింది. దీంతో టాక్సీ మార్గంలో పెద్ద గుంత ఏర్పడింది. పేలుడు నేపథ్యంలో జపాన్‌ 80కిపైగా విమానాలను దర్దు చేసినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు. అయితే తాజా పేలుడులో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. పేలుడ జరిగిన ప్రాంతానికి సమీపంలో బాంబులు కూడా లేవని తెలిపారు.

బాంబు పేలినట్లు నిర్ధారణ..
పేలుడు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్‌ ఆత్మరక్షణ దళాలు.. తనిఖీలు నిర్వహించాయి. పేలుడుపై దర్యాప్తు చేపట్టాయి. బాంబు కారణంగానే పేలుడు జరిగిందని నిర్ధారించారు. తర్వాత ప్రమాదం లేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. పేలుడు దృశ్యాలు సమీపంలోని ఏవియేషన్‌ స్కూల్‌లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పేలుడు ధాటికి తారు ముక్కలను ఫౌంటేన్‌లా గాలిలో చిమ్మడం అందులో కనిపించింది. జపనీస్‌ టెలివిజన్‌లో ప్రసారమైన వీడియోలో టాక్సీవేలో సుమారు 7 మీటర్ల వ్యాసం, 1 మీటరు లోతులో గుంత ఏర్పడనిట్లు తెలిపింది.

విమానాలు రద్దు..
పేలుడు కారణంగా బుధవారం మధ్యాహ్నం 80కిపైగా విమానాలు రద్దు చేసినట్లు చీఫ్‌ క్యాబినెట్‌ సెక్రటరీ యోషిమాసా హయాషి తెలిపారు. ట్యాక్సీవే డ్యామేజ్‌ని రాత్రికి రాత్రే సరిచేశామని, గురువారం ఉదయం విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయని విమానాశ్రయం తెలిపింది. మియాజాకి విమానాశ్రయం 1943లో మాజీ ఇంపీరియల్‌ జపనీస్‌ నేవీ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఫీల్డ్‌గా నిర్మించబడింది, దీని నుంచి కొంతమంది పైలట్లు ఆత్మాహుతి దాడి మిషన్‌లకు బయలుదేరారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం వేసిన పేలని బాంబులు ఈ ప్రాంతంలో బయటపడ్డాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. యుద్ధ సమయంలో వందల టన్నుల పేలని బాంబులు జపాన్‌ చుట్టూ పాతిపెట్టబడ్డాయి. కొన్నిసార్లు నిర్మాణ ప్రదేశాలలో బయటపడ్డాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version