Donkey Industry in China: చాలా మందికి చైనా ప్రోడక్ట్ అంటే నచ్చవు. కానీ కొందరు తక్కువ ధర అని కొనుగోలు చేస్తుంటారు. చాలా దేశాల్లో ఈ చైనా ప్రొడక్ట్స్ ను ఉపయోగించే వారు ఉన్నారు. అందుకే ఈ దేశం దేశవిదేశాల్లో దాని వాణిజ్యాన్ని విజయవంతంగా నడపగలుగుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశ వస్తువులు కాస్త చీప్ ధరలో లభిస్తాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదేంటంటే?
చైనా పాకిస్తాన్ గాడిదలను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటుందనే వార్త మీరు వినే ఉంటారు. ఇలా చేయడానికి చైనా భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది. కానీ నేడు ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ముందు ఒక వింత సంక్షోభం తలెత్తింది. దీని కారణంగా, చైనా అకస్మాత్తుగా మీడియా ముఖ్యాంశాల్లోకి వచ్చింది. ఈ దేశంలో ఏకంగా గాడిదలకు సంబంధించి దాదాపు 58000 కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే నమ్ముతారా? కానీ అదే వాస్తవం. విని షాక్ అయ్యారు కదా.
Also Read: Iceland: ఈ భూమ్మీద దోమలు కనిపించని.. పాములు సంచరించని ప్రాంతం ఇదే..
కానీ నేడు ఈ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి కారణం చైనాలో గాడిదల సంఖ్య 75 శాతానికి పైగా తగ్గింది. ఇక్కడ గాడిద చర్మానికి సంబంధించిన భారీ వ్యాపారం జరుగుతుందట. సాంప్రదాయ ఔషధం ఎజియావో దాని చర్మం నుంచి తయారు చేస్తారట.
చైనాలో గాడిద సంక్షోభం
ఈ ఔషధం వృద్ధాప్యాన్ని తగ్గించడంలో, రక్త ప్రసరణను పెంచడంలో, మహిళల సంతానోత్పత్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపణ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఔషధానికి డిమాండ్ వేగంగా పెరగడం వల్ల, దాని అక్రమ రవాణా కూడా చాలా పెరిగింది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచ జంతు వ్యాపారులు, సంబంధిత సంస్థలు చాలా ఆందోళన చెందుతున్నాయి.
చైనా భారతదేశంతో సహా అనేక దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకుంటుంది. కానీ ఆ దేశాలు దాని వధపై ఆంక్షలు విధించాయి. అందువల్ల, చైనా ఇప్పుడు ఆసియా-ఆఫ్రికాతో సహా ఇతర దేశాల నుంచి గాడిదలను దిగుమతి చేసుకుంటోంది.
నిరసన ఎందుకు ఉంది?
దీనికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు, జంత హక్కుల సంస్థలు. ఇలా గాడిదలను చంపడం జంతువుల జీవించే హక్కును ఉల్లంఘించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుందని వాదిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు గ్రామాలు కొన్ని విషయాలకు గాడిదలపై ఆధారపడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఒకవైపు నిపుణులు దీని గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు, గాడిదలకు ప్రత్యామ్నాయాలను కనుగొనాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు చైనా పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.