Iceland: ఒకప్పుడు వర్షాకాలంలో దోమలు విపరీతంగా ఉండేవి.. కానీ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా దోమలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. ఇక పాముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డిస్కవరీ లోనే రాచనాగులను, పెద్ద పెద్ద తాచుపాములను చూసేవాళ్ళం. ఇప్పుడు నగరాల్లో కూడా పాములు దర్శనమిస్తున్నాయి. చివరికి వేసుకునే బూట్లల్లో కూడా పాములు ప్రవేశించి బుసలు కొడుతున్నాయి.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
ప్రస్తుతం వర్షాకాలం.. ఇక దోమల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దండయాత్ర చేసేస్తాయి. రక్తాన్ని పీల్చేసి రక్త చరిత్ర సినిమా చూపిస్తాయి. ఇక పాములైతే బుసలు కొడతాయి. ఆదమరచి తొక్కితే కాటు వేస్తాయి. ప్రాణాలు కూడా తీస్తాయి. అందువల్లే వర్షాకాలంలో దోమలతో ఎంత ప్రమాదమో.. పాములతో అంతకంటే ఎక్కువ ప్రమాదం. పైగా దోమల వల్ల వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తాయి. ఇక డెంగ్యూ జ్వరం వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదమే. గతంలో డెంగ్యూ జ్వరాలు విజృంభించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో ఏకంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.. నాటి రోజుల్లో ఏకంగా కేంద్ర అధికారుల బృందం బోనకల్ లోకి వచ్చిందంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాముల గురించి, దోమల గురించి ఇంతటి ఉపోద్ఘాతం చెబుతుంటే.. అసలు అలాంటివి మా దేశంలో లేవని అంటున్నారు ఐస్లాండ్ వాసులు. ఇంతకీ అక్కడ దోమలు కనిపించకపోవడానికి.. పాములు బుస కొట్టక పోవడానికి కారణాలు ఏమిటంటే..
అందువల్లే దోమలు, పాములు అక్కడ ఉండవు
ఐస్లాండ్ అనేది ఒక మంచు దేశం. అలాగని సంవత్సరం మొత్తం మంచు కురవదు. చెప్పుకునే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. కాకపోతే అది శీతల ప్రాంతంగా పేరుపొందింది. ఇక ఈ భూమి మీద మొత్తం 3,900 జాతుల పాములు ఉన్నాయి. మూడు వేలకు పైగా దోమలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఐస్లాండ్ దేశంలో ఒక్కటి కూడా కనిపించవు. ఇక్కడ వాతావరణం వేగంగా మారుతూ ఉంటుంది. ముందుగా చెప్పినట్టు ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా నమోదు అవుతాయి. ఇక్కడ జనాభా భారీగా ఉండదు. నివాసాలు కూడా దూరంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలు తమ వినియోగించుకున్న తర్వాత వదిలే వృధా నీటిని ఒకచోట నిల్వ చేయడానికి ఇష్టపడరు. దానికి బదులుగా ప్రవాహంలో కలిసే విధంగా చేస్తారు. నీతో దోమలు గుడ్లు పెట్టేందుకు ఏమాత్రం అనుకూలమైన వాతావరణము ఉండదు. ఇక పాములు సంచరించడానికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. అందువల్లే ఐస్లాండ్ దేశంలో పాములు కనిపించవు. దోమలు కాటు వేయవు. అందువల్లే అక్కడ అంటూ వ్యాధులు ప్రబలే శాతం చాలా తక్కువగా ఉంటుంది. నీటిని అక్కడి ప్రజలు కాచి వడపోసి తాగుతారు. ఒకవేళ అక్కడి ప్రజలు దోమలను చూడాలంటే.. పాములను వీక్షించాలంటే డిస్కవరీ ఛానల్ మాత్రమే దిక్కు.
ఏ జంతువులు ఎక్కువగా కనిపిస్తాయంటే..
ఐస్లాండ్ ప్రాంతంలో మాత్రం చేపలు విపరీతంగా ఉంటాయి. ఇక మంచు ప్రాంతాల్లో పెరిగే జంతువులు ఎక్కువ కనిపిస్తుంటాయి. ధ్రువపు ఎలుగుబంట్లు, సీల్ చేపలు అక్కడ విస్తృతంగా దర్శనమిస్తుంటాయి. దోమలు లేకపోవడం వల్ల.. పాములు కనిపించకపోవడం వల్ల అక్కడ అంటువ్యాధులు సోకే అవకాశం ఉండదు. అంతేకాకుండా పాము కాటు కేసులు నమోదయ్యే అవకాశం లేదు.. కాకపోతే అత్యంత శీతల వాతావరణం వల్ల వయసు పైబడిన వారు.. చలికి తట్టుకోలేక కన్నుమూస్తుంటారు. ఈ కారణం వల్ల అక్కడ ఎక్కువగా మరణాలు చోటుచేసుకుంటాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రజలు వ్యవసాయం.. ఇతర చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవిస్తుంటారు. పర్యాటక పరంగా కూడా ఐస్లాండ్ దేశం భారీగానే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ఉంటుంది.