https://oktelugu.com/

Thailand: ఈ దేశంలో భార్యలను అద్దెకి ఇస్తారట.. ఇంతకీ ఎక్కడంటే?

అద్దె దుస్తులు, గదులు లాగా అద్దె భార్యలను ఇవ్వడానికి ప్లాన్ చేసింది. భార్యలను అద్దెకి ఇవ్వడమేంటని అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. అయితే భార్యలను అద్దెకి ఎంత ధరకు ఇస్తారో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 2, 2024 / 03:20 PM IST

    rent a wife

    Follow us on

    Thailand: విహార యాత్రలకు వెళ్తుంటే అన్ని సౌకర్యాలను మనం తీసుకుని వెళ్లలేం. దీంతో మనకి కావాల్సిన కొన్ని వస్తువులను రెంట్‌కి తీసుకుంటాం. అయితే డబ్బులు ఉండాలే కానీ మనకి కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా దొరుకుతాయి. ట్రిప్‌కి వెళ్తున్నారంటే చాలా మంది ఎంజాయ్ చేయాలని ముందు ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే మందు, అమ్మాయిలు అని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో బాగా ఎంజాయ్ చేసే బ్యాంకాక్, గోవా, థాయ్‌లాండ్ వంటి ప్లేస్‌లను ఎంచుకుంటారు. అయితే చాలా ఇంటర్నేషనల్ ట్రిప్‌కు వెళ్లే వాళ్లు థాయ్‌లాంలడ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సాధారణంగా ఈ దేశంలో ప్రాస్టిట్యూషన్ అనేది నేరం. ఈ క్రమంలో ఇక్కడి టూరిజం ఓ సరికొత్త ప్లాన్ వేసింది. అద్దె దుస్తులు, గదులు లాగా అద్దె భార్యలను ఇవ్వడానికి ప్లాన్ చేసింది. భార్యలను అద్దెకి ఇవ్వడమేంటని అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. అయితే భార్యలను అద్దెకి ఎంత ధరకు ఇస్తారో చూద్దాం.

    ధాయ్‌లాండ్ వెళ్లిన వారు అక్కడ ఎంజాయ్ చేయాలంటే భార్యలను అద్దెకి తీసుకోవచ్చు. ఈ రెంటల్ వైఫ్స్ విధానంలో అగ్రిమెంట్ చేసుకుని భార్యలను అద్దెకి ఇస్తారు. థాయ్‌లాండ్‌లో భార్య కావాలంటే బ్రోకర్లను సంప్రదించాలి. వారిని సంప్రదిస్తే మీకు కావాల్సిన అమ్మాయిని భార్యగా ఇస్తారు. అయితే ఒక్కో అమ్మాయి బట్టి రేటు ఉంటుంది. సుమారుగా పదహారు వందల డాలర్ల నుంచి రేటు ప్రారంభం అవుతుంది. అమ్మాయిని బట్టి లక్షా డాలర్ల వరకు కూడా ధర ఉంటుంది. అయితే ప్రాస్టిట్యూషన్‌ను నేరంగా భావించిన థాయ్‌లాండ్ ఈ రెంటల్ వైఫ్స్‌కి అసలు వ్యతిరేకించలేదు. అయితే ఈ విధానం ఎక్కువగా రెడ్ లైట్ జిల్లాలు, బార్‌లు, నైట్ క్లబ్‌లో కనిపిస్తుంది. ఈ విధానం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. వీరు ఎన్ని రోజులు అద్దె బార్య కావాలో తాత్కాలికంగా బాండ్ రాసుకుంటారు. కొందరు రోజుల నుంచి నెలల వరకు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే డబ్బును మహిళలు కుటుంబ పోషణకు వినియోగిస్తుంటారు.

    థాయ్‌లాండ్‌లో ఇటీవల కాలంలో కేవలం అద్దె భార్యలే కాకుండా అద్దె స్నేహితులు కూడా ఉంటున్నారు. ఈ విధానం వల్ల థాయ్‌లాండ్ టూరిజానికి కూడా ఆర్థికంగా బెనిఫిట్ లభిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉంటున్న మహిళలు ఈ విధానాన్ని అవలంభించి.. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. దీన్ని కుటుంబ పోషణకు ఉపయోగిస్తారు.వీరిలో ఎక్కువగా పేదరికానికి చెందిన మహిళలే ఉన్నారు. అయితే ఈ విధానంపై కొందరు తప్పు పడుతున్నారు. దీనివల్ల సంబంధాలు చెడిపోతాయని, కుటుంబ సభ్యులకు విలువ ఇవ్వరని అంటున్నారు. మరి ఈ అద్దె భార్యపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.