TANA Food Drive : కమింగ్ (జార్జియా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) సేవా కార్యక్రమాల్లో భాగంగా సౌత్ ఈస్ట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫుడ్ డ్రైవ్’ కార్యక్రమం ఘనవిజయం సాధించింది. జార్జియాలోని కమింగ్‌లో ఉన్న ‘మీల్స్ బై గ్రేస్’ ఫుడ్ బ్యాంక్‌కు మద్దతుగా తానా యువ వాలంటీర్లు చేపట్టిన ఈ సేవానిరతి స్థానిక కమ్యూనిటీలో ప్రశంసలు అందుకుంటోంది.

1000 పౌండ్ల ఆహార సేకరణ
సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో యువ వాలంటీర్లు అంకితభావంతో పనిచేశారు. స్థానిక డ్రాప్-ఆఫ్ కేంద్రాల ద్వారా సుమారు 1000 పౌండ్లకు పైగా బియ్యం, సీరియల్స్, టిన్ కూరగాయలు, వంట నూనె, పాస్తా వంటి నిత్యావసరాలను సేకరించారు. సేకరించిన ఈ ఆహార పదార్థాలను ‘మీల్స్ బై గ్రేస్’ ప్రతినిధులకు అందజేసి పేదరికం, ఆకలితో అలమటించే వారికి అండగా నిలిచారు.

నాయకత్వానికి అభినందనలు
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సమన్వయం చేసిన దీప్తి తల్లూరితో పాటు, చురుగ్గా పాల్గొన్న యువ నాయకులను తానా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లందరికీ తానా బృందం సర్టిఫికెట్లను అందజేసి వారి కృషిని గౌరవించింది. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, సహాయం అందించిన కమ్యూనిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసింది.

పాల్గొన్న ప్రముఖులు
తానా సౌత్ ఈస్ట్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ కొల్లు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కీలక నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఈవీపీ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ భరత్ మద్దినేని, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ. ప్రముఖ ప్రతినిధులు సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, ఆర్థిక అన్నె, పూలని జాస్తి, కోటి కందిమల్ల, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, వినయ్ మద్దినేని, ఉప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తానా సౌత్ ఈస్ట్ నాయకులు మాట్లాడుతూ.. అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని మార్గదర్శకత్వంలో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలను మున్ముందు చేపట్టనున్నట్లు తెలిపారు.

వాలంటీర్ల సందడి:
మాన్య మహేశ్వరం, గాయత్రి, రామప్రియ, శ్రీహర్ష, రిత్విక్, వెంకటరామన్, లోచన్ కుమార్, ఆధ్య, లిషిత, చనస్య, అవంతిక, మనస్విని, సాత్విక్, తన్వి, శ్రీనిధి, షాన్విక్, అమయ, మోక్ష్, జస్మిత, రాహుల్, కార్తీక్, సాత్వికేయ, సౌమిల్, యశశ్రీ, ప్రజ్ఞ, లోహిత్ తదితర యువ వాలంటీర్లు ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని స్ఫూర్తిగా నిలిచారు.