Swiss Viral Video: దేశంలో అల్ఫ్స్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పచ్చిక బయళ్లు అధికంగా ఉంటాయి. ఏడాది పాటు పచ్చిక బయళ్లల్లో పచ్చగడ్డి విస్తారంగా ఉంటుంది. అందువల్లే పశువులు ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఇక్కడ పాడి పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ విద్యాధికులు కూడా పాడి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. విస్తారంగా పశువులను పెంచుతూ దండిగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ మైదాన ప్రాంతాలు అధికంగా ఉండడం వల్ల పశువులకు పశుగ్రాసం కొరత ఉండదు. అయితే ప్రస్తుతం స్విట్జర్లాండ్ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాలు అధికంగా ఉన్న ఈ దేశంలో కొండ చరియలు విరిగిపడడం సర్వసాధారణం. కొండ చరియలు అధికంగా ఉన్న ప్రాంతాలలో అవి విరిగిపడినప్పుడు పశువులు గాయపడుతుంటాయి. పైగా ఆ ప్రాంతాలలో జనావాసాలు అంతగా ఉండవు. అలాంటప్పుడు పశువులను కాపాడటం అక్కడి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పశువులను వారు అలానే వదిలేస్తుంటారు. కొందరు వాటిని కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం స్విట్జర్లాండ్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అక్కడి రైతులు ఆవులను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేశారు.
ఇంతకీ ఏం చేశారంటే
సాధారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు.. గాయపడిన వారిని.. బాధితులను అమాంతం ఎయిర్ లిఫ్ట్ విధానంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇదే విధానాన్ని స్విట్జర్లాండ్ దేశ రైతులు కూడా అవలంబించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం విపరీతంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎయిర్ లిఫ్ట్ విధానంలో గాయపడిన ఆవులను.. ఇతర పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. స్విట్జర్లాండ్ ప్రాంతంలోని బ్లాటెన్ ఏరియాలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలో గాయపడిన ఆవులను హెలికాప్టర్ లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బ్లాటెన్ ఏరియా ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో ఉంటుంది. ఇక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో ఆవులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి హెలికాప్టర్ ను రైతులు ఉపయోగిస్తున్నారు. ఆ ఆవులను పశు వైద్యుల దగ్గరికి తీసుకెళుతున్నారు. కోడి పిల్లలను గద్ద ఎత్తుకెళ్లినట్టు.. హెలికాప్టర్ల సహాయంతో ఆవులను రైతులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆవులకు పశు వైద్యులు సపర్యలు చేస్తున్నారు. విద్య రకాల చికిత్సలు అందించి.. వాటిని కోలుకునేలా చేస్తున్నారు. అంతేకాదు ప్రత్యేకమైన షెడ్లలో వాటిని సాకుతున్నారు. సాధారణంగా మనుషులకే విలువ లేని ఈ రోజుల్లో.. పశువులను ఎయిర్ లిఫ్టు విధానంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ రైతులు చేస్తున్న ప్రయత్నానికి సర్వత్ర ప్రశంస లభిస్తున్నది.
View this post on Instagram