Homeఅంతర్జాతీయంSingapore Birth Incentive: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి బిడ్డకు ఏడు లక్షలు..

Singapore Birth Incentive: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి బిడ్డకు ఏడు లక్షలు..

Singapore Birth Incentive: యువత దేశానికి ప్రధాన బలం. యువత ద్వారానే దేశం వృద్ధి బాటలో పయనిస్తుంది. యువత సక్రమంగా ఉంటేనే ఆదేశం అద్భుతమైన దిశలో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అందువల్ల యువతను దేశానికి చోదక శక్తి అని పిలుస్తుంటారు. యువత వల్ల బాగుపడిన దేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశాన్ని తీసుకుంటే.. ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ గా భారత్ ఉంది. నాల్గవ ఆర్థిక శక్తిగా అవతరించింది. ఇంకా వినూత్నమైన ఆవిష్కరణలను […]

Singapore Birth Incentive: యువత దేశానికి ప్రధాన బలం. యువత ద్వారానే దేశం వృద్ధి బాటలో పయనిస్తుంది. యువత సక్రమంగా ఉంటేనే ఆదేశం అద్భుతమైన దిశలో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అందువల్ల యువతను దేశానికి చోదక శక్తి అని పిలుస్తుంటారు. యువత వల్ల బాగుపడిన దేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశాన్ని తీసుకుంటే.. ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారులు ఉన్న మార్కెట్ గా భారత్ ఉంది. నాల్గవ ఆర్థిక శక్తిగా అవతరించింది. ఇంకా వినూత్నమైన ఆవిష్కరణలను భారత్ చేస్తోంది. దీనంతటికీ ప్రధాన కారణం యువత.

చైనా మనల్ని చూసి భయపడుతోంది అంటే.. అమెరికా మనతో జాగ్రత్తగా ఉంటోంది అంటే.. మిగతా దేశాలు మనకు రెస్పెక్ట్ ఇస్తున్నాయంటే.. దీనికి ప్రధాన కారణం మన దేశంలో ఉన్న యువత. మనదేశంలో ఉన్న యువత వల్ల ఎన్నో ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి. మన దేశ ఆర్మీ అత్యంత పటిష్టంగా ఉంది. మిగతా రంగాలలో కూడా భారతదేశం సమర్థవంతంగా ఉంది. అందువల్లే యువతకు ఎక్కువ అవకాశాలు మన దేశంలో లభిస్తున్నాయి. యువత వల్ల సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది కాబట్టే.. యువ జనాభా అధికంగా ఉండాలని ప్రపంచంలో అన్ని దేశాలు కోరుకుంటున్నాయి.

మొదట్లో చాలా దేశాలు జనాభా పెరుగుదలను చాలా వరకు నియంత్రించాయి. చైనా లాంటి దేశాలు అయితే ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దు ఇలాంటి నినాదాలు అమలయ్యాయి. ఇప్పుడు చైనాలో జననాల సంఖ్య తగ్గిపోయింది.. దీంతో జనాభాను పెంచేందుకు చైనా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలోకి సింగపూర్ కూడా చేరింది. సింగపూర్లో కొంతకాలంగా జనాభా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జననాల సంఖ్యను పెంచడానికి అక్కడి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇకపై దంపతులు అనే ప్రతిబిడ్డకు దశలవారీగా 55వేల డాలర్లు ఇవ్వబోతోంది. మన లెక్కల ప్రకారం చూసుకుంటే అది ఏడు లక్షల వరకు ఉంటుంది.. జననాల సంఖ్య తగ్గిపోవడం.. యువత సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనాభా సంఖ్యను పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. మూడో బిడ్డని కంటే ప్రభుత్వం తరఫునుంచి ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. తద్వారా జననాల సంఖ్య పెరుగుతుందని.. అది రాష్ట్రానికి ఉపయోగకరంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపును చాలామంది వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కానీ యువ జనాభా లేకపోతే దేశం ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper