America: అమెరికాలోని కాన్సాస్ సిటీలో ఐదు రోజుల క్రితం జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అమెరికా పోలీసులు గుర్తించారు. సూపర్ బౌల్ విజయం తర్వాత స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులపై ఇద్దరు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు.
సీసీ ఫుటేజీ విడుదల..
మొదట సమూహంపై కాల్పులు జరిపింది ఒక్కరే అని అంతా భావించారు. కానీ, తాజాగా సీసీ ఫుటేజీల ఆధారంగా సమూహంపై ఇద్దరు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఇద్దరిలో ఒకరి ముఖం కెమెరాల్లో రికార్డు అయింది. మరొక వ్యక్తి ముఖం మాత్రం కనిపిచంలేదు. ఈ వీడియలో ఎరుపు రంగుల ఉన్న యువకుడు ర్యాలీ సమయంలో మరో వ్యక్తితో గొడవ పడినట్లు పోలీసులు గుర్తించారు. నల్లటి దుస్తులు ధరించిన మరో యువకుడితో వాగ్వాదం జరుగడం వీడియోలో కనిపించింది. ఫుటేజీలో బ్రౌన్ జాకెట్‌లో ఉన్న వ్యకి, నలుపు జాకెట్‌లో ఉన్న మరొకరు, రెడ్ బీనీ వాగ్వాదంలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నట్లు అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరిపై అభియోగాలు మోపారు.
కాల్పుల్లో ఒకరు మృతి.. 21 మందికి గాయాలు..
ఇదిలా ఉండగా, మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారమే అమెరికాలో సూపర్ బౌల్ ఫైనల్ జరిగింది. అందులో ‘కాన్సాస్ సిటీ చీఫ్స్’ జట్టు విజయం సాధించింది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో కవాతు నిర్వహిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు.
పట్టుబడ్డ అనుమానితుడు..
ఇదిలా ఉంటే పరేడ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కొందరు అభిమానులు కూడా ఓ అనుమానితుడిని అదేరోజు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో కూడా బయటకు రావడంతో ఇద్దరు నిందితులను అమెరికా పోలీసులు నిర్ధారించారు.