Ayesha Takia
Ayesha Takia: హీరోయిన్ అయేషా టకియా లేటెస్ట్ లుక్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో ఆమె కనిపించగా… ఫోటోగ్రాఫర్స్ కెమెరాలో బంధించారు. అయేషా టకియా బాలీవుడ్ లో సత్తా చాటింది. 2004లో విడుదలైన టార్జాన్ చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. నెక్స్ట్ షాహిద్ కపూర్ కి జంటగా దిల్ మాంగే మోర్ చేసింది. ఇది రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ అయేషా టకియాను తెలుగులో పరిచయం చేశాడు.
యాక్షన్ థ్రిల్లర్ ‘సూపర్’ లో అయేషా టకియా హీరోయిన్. బ్యూటిఫుల్ డాక్టర్ పాత్రలో గ్లామర్ ఒలకబోసింది. నాగార్జునతో అయేషా టకియా కెమిస్ట్రీ బాగా కుదిరింది. 2005లో విడుదలైన సూపర్ ఓ మోస్తరు విజయం అందుకుంది. ఒక్క సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై ఆమెకు తెలుగులో ఆఫర్స్ వచ్చినా చేయలేదు.
బాలీవుడ్ లో బిజీ కావడంతో ఆమె తెలుగు చిత్రాలను పక్కన పెట్టేశారు. 2009 వరకు అయేషా కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. సల్మాన్ ఖాన్ కి జంటగా వాంటెడ్ మూవీ చేసింది. ఇది మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి రీమేక్. హిందీలో కూడా పోకిరి ఇరగదీసింది. అప్పటి వరకు సల్మాన్ ఖాన్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. వాంటెడ్ రూపంలో ఆయన సాలిడ్ హిట్ కొట్టాడు. వాంటెడ్ తో అయేషా రేసులోకి దూసుకొచ్చింది.
అనూహ్యంగా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో ఆమె వివాహం చేసుకుంది. అప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి నటనకు గుడ్ బై చెప్పింది. 2009లో ఫర్హాన్ అజీమ్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి. తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ లో కొడుకు, కుటుంబ సభ్యులతో కనిపించింది. చెప్పాలంటే ఆమె లుక్ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇక అయేషా టకియాకు ఇప్పటికీ ఆఫర్స్ వస్తున్నాయట. కానీ తనకు నటించే ఆసక్తి లేదని ఆమె తేల్చి చెబుతున్నారు.
Web Title: Heroine ayesha takias latest photos are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com