Fact check Pakistan cricketer Shahid Afridi : సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో అఫ్రిది కన్నుమూశాడని పేర్కొంటున్నారు. అఫ్రిది పాకిస్తాన్ దేశానికి వీరాభిమాని. పాకిస్థాన్లో ఎలాంటి కార్యకలాపాలు జరిగినా బహిరంగంగానే తన మద్దతును ప్రకటించేవాడు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసేవాడు.. ఇక ఇటీవల పహల్గాం ఉదంతం చోటు చేసుకున్న తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత.. షాహిదీ అఫ్రిది మన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి యూట్యూబ్ ఛానల్ పై మనదేశంలో నిషేధం విధించారు. దీంతో అప్పట్లో అఫ్రిది వార్తల్లో నిలిచాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మనపై విజయం సాధించిందని చెబుతూ ఆ దేశంలో అఫ్రిది తన అనుచరులతో ర్యాలీ కూడా నిర్వహించాడు. భారత ప్రజలను విమర్శించాడు. భారత సైన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న వైరల్ వీడియోలో అఫ్రిది చనిపోయాడని చెబుతున్నారు. అంటే కాదు అతడిని పాకిస్తాన్ దేశంలోని ప్రముఖ నగరమైన కరాచీలో ఖననం చేశారని అంటున్నారు. అఫ్రిది చనిపోయిన నేపథ్యంలో అతడికి విజన్ గ్రూప్ చైర్మన్, ఇతర ప్రముఖులు, అధికారులు సంతాపం తెలిపారని ఆ వీడియోలో పేర్కొన్నారు.. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు జరిగినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే అఫ్రిది చనిపోలేదు. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. పైగా తన కుటుంబంతో కలిసి ఉన్నాడు. అతడు బ్రహ్మాండంగా తన యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేసుకుంటున్నాడు. క్రికెట్ పై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. అఫ్రిది చనిపోయాడు అని చెబుతున్న వీడియోను పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించారు. ఇదే విషయాన్ని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. అతని మరణ వార్త పూర్తిగా అబద్ధమని.. అఫ్రిది అంటే పడనిశక్తులు ఇటువంటి వీడియోను రూపొందించాలని పాకిస్థాన్ దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
ఇక ఇటీవల ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు అఫ్రిది, అఖ్తర్ తో సహా అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ ను భారత నిషేధించింది.. అఫ్రిది చాలా కాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అతడు పాకిస్తాన్ రాజకీయాలలో తెర వెనుక పాత్ర పోషిస్తున్నాడు. 2017 లోనే అతడు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడు అంతర్జాతీయ క్రికెట్లో 11 వేలకు పైగా రన్స్ చేశాడు. అన్ని విభాగాలలో కలిపి ఏకంగా 541 వికెట్లు పడగొట్టాడు. వన్డే ఫార్మాట్ లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది కొనసాగుతున్నాడు. అఫ్రిది ఏకంగా 351 సిక్సర్లు కొట్టాడు. అయితే ఇతడి రికార్డును బద్దలు కొట్టడానికి ఇండియన్ వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొంత దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో ఏడు సిక్సర్లు గనుక అతడు కొడితే అఫ్రిది రికార్డును అతడు ఈజీగా బద్దలు కొడతాడు. అయితే అఫ్రిది మరణ వార్తను అతడి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా గిట్టని వ్యక్తులు చేస్తున్న పని అంటూ మండిపడుతున్నారు.అఫ్రిది ఆకాశమంత గొప్పదని.. దానిని చేరుకోవాలంటే వారు వందల జన్మలు ఎత్తాలని హితవు పలుకుతున్నారు. ఇలాంటి చవక బారు ప్రదర్శనలు మానుకోవాలని సూచిస్తున్నారు.