Shambhala Movie Teaser : టాలెంట్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలలో ఒకరు ఆది సాయి కుమార్(Aadi Sai Kumar). ప్రముఖ సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడిగా ఇతను ‘ప్రేమ కావాలి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అనుకున్నారు కానీ, తొలిసినిమానే అతని చివరి సూపర్ హిట్ గా మిగిలిపోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ సినిమా తర్వాత ఆది ఎన్నో చిత్రాలు చేసాడు కానీ, ఒక్కటి కూడా సంపూర్ణమైన కమర్షియల్ హిట్ గా నిలబడలేదు. మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు వచ్చాయి కానీ, అవి ఆయన మార్కెట్ ని పెంచడం కోసం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆది సాయి కుమార్ ‘శంబాలా'(Sambhala – The Mystic World) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.
కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ గత ఆది సినిమాలతో పోలిస్తే చాలా కొత్తగా, ప్రామిసింగ్ గా అనిపించింది. కచ్చితంగా ఈ సినిమా తో భారీ హిట్ ని ఆది అందుకోబోతున్నాడనే బలమైన నమ్మకం ఈ టీజర్ ని చూసిన వారిలో కలిగింది. టీజర్ ఆరంభం నుండే చాలా ఆసక్తిగా అనిపించింది. ‘ఈ విశ్వం లో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ కి సమాధానం దొరకనప్పుడు వాటిని మూఢనమ్మకం అంటుంది. అదే సమాధానం దొరికితే అదే తన గొప్పతనం అంటుంది’ అని బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తున్నప్పుడే ఆకాశం నుండి ఒక ఆస్ట్రోనట్ అత్యంత వేగంగా భూమి వైపుకు దూసుకొచ్చి ఒక గ్రామం లో పడుతుంది. ఆ ఆస్ట్రోనట్ భూమి మీద పడినప్పటి నుండి ఆ గ్రామం లో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
పంచభూతాలు ఆ ఆస్ట్రోనట్ ఆదీనంలో ఉంటాయి. దాని ప్రభావం వల్ల ఊహించని పరిస్థితులు ఎదురు అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు హీరో ఎంట్రీ అసలు సమస్యలకు దారి చూపిస్తుందా?, ఇంతకీ ఆ ఆస్ట్రోనట్ విశిష్టత ఏమిటి?, ఎందుకు అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది హీరో ఛేదించాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ అన్నట్టుగా డైరెక్టర్ చూపించేసాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ కథని సరైన పద్దతిలో తీసి , స్క్రీన్ ప్లే మంచిగా ఉంటే తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆది సినిమా వస్తుందంటే ఇంతకు ముందు అసలు ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. అలాంటిది ఈ సినిమా టీజర్ గురించి ఇంతమంది మాట్లాడుకుంటున్నారంటే కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను టీజర్ తోనే ఆకర్షించింది అని చెప్పొచ్చు. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది.