Taiwan Earthquakes : తూరు ఆసియా దేశం తైవాన్‌ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు(6 గంటల వ్యవధి) భూమి 80 సార్లు కంపించి. ప్రజలు భయంతో రోడ్డమీదకు పరుగులు తీశారు. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇప్పటికీ ప్రకంపనలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక భూకంపాల ధాటికి కొన్ని భవనాలు కూలిపోయాయి. ప్రాణ నష్టంపై అధికారిక ప్రకటన రాలేదు. ఏప్రిల్ మొదటి వారంలోనే తైవాన్ భారీ భూకంపం ధాటికి వణికిపోయింది. తాజాగా ప్రకంపనలు ఆ దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
రాత్రంటా ప్రకంపనలు..
తైవాన్ తూర్పు ప్రాంతంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు భూమి కంపిస్తూనే ఉంది. భారీ ప్రకంపనల ధాటికి రాజధాని తైపీలో భవనాలు ఊగిపోయాయి. ఇక భూకంప కేంద్రం హువాలిన్‌లో నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన ప్రకంపనల్లో రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రత అధికంగా నమోదైందని అక్కడి అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3న సంభవించిన భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దీని ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. ఫ్లైఓవర్లు, వంతెనలు కూడా ఊగిపోయాయి. అయితే ప్రాణనష్టం మాత్రం జరుగలేదు. అప్పటి నుంచి తైవాన్‌లో నిత్యం భూమి కంపిస్తూనే ఉంది.
భూకంపాలు సాధారణమే..
ఇదిలా ఉంటే రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉండడంతో తైవాన్ లో భూకంపాలు సాధారణమే. 1993లో రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా.. 2 వేల మంది మరణించారు. ఆ తర్వాత 2016లో వచ్చిన భూకపంతో ఆ దేశ దక్షిణ ప్రాంతంలో 100 మంది మరణించారు. తాజాగా 2024, ఏప్రిల్ 3న సంభవించిన భూకంపం 25 ఏళ్ల తర్వాత భారీ భూకంపంగా నమోదైంది.