Chiranjeevi : చిరంజీవి.. సినిమా రంగంలో ఓ లెజండ్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా కూడా సున్నిత మనస్కుడు.. అందరివాడు. తగాదాలకు వెళ్లనివాడు. స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగిన వాడు. సినిమా ఫీల్డ్ లో నంబర్ 1 మెగా స్టార్ గా ఉండి మధ్యలో 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2012లో ఫెయిల్ అయిపోయి నిష్క్రమించాడు.
రాజకీయాలు వదిలేసి సినిమాలు చేస్తూ చాలా ప్రశాంతమైన జీవితం గడిపాడు. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అటువంటి వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒక వైపు సీఎం రమేష్, మరోవైపు పంచకర్ల రమేష్ ను కూర్చుండబెట్టుకొని తాను టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నాను. తన తమ్ముడు జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి నా సపోర్టు వీరికేనని ప్రకటించారు. రమేష్ లు ఇద్దరు మంచి వ్యక్తులు ఓటేయాలని కోరాడు.
వారం క్రితం పవన్ కళ్యాణ్ కు రూ.5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి చిరంజీవి మంచి మనసు చాటుకున్నారు. కుటుంబం తరుఫున అన్నగా ఇవ్వడం విశేషం.
టీవీ9 రజినీకాంత్ దీని మీద టీఆర్పీ కోసం రచ్చ చేశాడు. చిరంజీవి శక్తినా? వ్యక్తినా? అంటూ ఆయన చెబితే ఓటేస్తారా? అంటూ అవమానంగా మాట్లాడారు. ఈ చర్చలో వాసిరెడ్డి పద్మపై బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. చిరంజీవిని ఓ రకంగా అవమానించారు.
చిరంజీవి వ్యాఖ్యలు, దాని పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.