Keerthi Suresh: ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్… వరుడు డిటైల్స్ ఇవే!

వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. అలాగే బాలీవుడ్ లో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తుంది.

Written By: S Reddy, Updated On : April 23, 2024 1:01 pm

Keerthy Suresh is ready to marry her boyfriend

Follow us on

Keerthi Suresh: సౌత్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ బాల నటిగా పరిశ్రమలో అడుగుపెట్టింది. అనంతరం హీరోయిన్ గా మారి ప్రతిభతో తక్కువ సమయంలోనే స్టార్డం సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.ఇక మహానటి సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.

వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. అలాగే బాలీవుడ్ లో కూడా పాగా వేసే ప్రయత్నం చేస్తుంది. ఓ హిందీ చిత్రాలకు సైన్ చేసింది. గ్లామరస్ పాత్రల్లో నటించడానికి కూడా కీర్తి సురేష్ సిద్ధంగా ఉన్నారట. కాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చాలాకాలంగా కీర్తి సురేష్ పెళ్లి పై పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి.

గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె తండ్రి ఖండించడంతో బ్రేక్ పడింది. అలాగే ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం అని, మరో నటుడితో పెళ్లి వంటి రకరకాల కథనాలు వెలువడ్డాయి. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోనుందనే వాదన తెరపైకి వచ్చింది. గత 13 ఏళ్ల నుంచి కీర్తి సురేష్ అతనితో రిలేషన్ లో ఉన్నారట. ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఒప్పుకున్నారట.

త్వరలో కీర్తి సురేష్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందట. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ .. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక త్వరలో ‘ బేబీ జాన్ ‘ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ విజయ్ హీరోగా నటించిన ‘ తేరి ‘ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. పలు భాషల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉన్నారు.