Israel: తమదేశంపై అకారణంగా దాడిచేసిందన్న కారణంతో 2023 అక్టోబర్‌లో హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఏడాది కావొస్తున్నా యుద్ధం ముగియకపోగా కొత్త దేశాలు ఇందులో చేరుతున్నాయి. హమాస్ బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించుకునేందుకే ఆ దేశం దాదాపు ఎనిమిది నెలలు హమాస్‌తో యుద్ధం చేసింది. చివరకు హమాస్ చీఫ్‌ను సీక్రెట్ ఆపరేషన్‌తో ఇరాన్‌లో అంతం చేసింది. దీంతో ఆగ్రహించిన హెజ్‌బొల్లా, ఇరాన్ తీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా దిగుమతి చేసుకుంటున్న పేజలు, వాకీటాకీలలో పేలుడు పదార్థాలు అమర్చి పేల్చివేసింది. దీంతో హెజ్‌బొల్లాకు తొలిదెబ్బ తగిలింది. తర్వాత ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని వాటి స్థావరాలపై వైమానికి దాడులు చేపట్టింది. కేవలం వారం వ్యవధిలోనే హెజ్‌బొల్లా ఛీప్ నస్రల్లాను మట్టుపెట్టింది. కీలక నేతలను చంపేసింది. అయినా హెజ్‌బొల్లా వెనక్కి తగ్గడం లేదు. తమ దేశం కోసం పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ యుద్ధరంగంలోకి దిగింది. అమెరికా భయపడినట్లే జరిగింది. ఏకకాలంలో వందకుపైగా క్షిపుణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ క్షిపిణులను తిప్పి కొట్టింది. తమ దేశ పౌరులకు నష్టం కలుగకుండా చూసుకుంది. అయితే ఈ దాడి ఆ ప్రాంతంలో అగ్గి రాజేసింది. వీటికి తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
యూఎన్‌వో చీఫ్‌పై నిషేధం..
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌పై దాడికి ఖండించని వారెవరికీ తమ దేశంలో అడుగు పెట్టే అర్హత లేదని ఆదేశ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించారు. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రెటరీ జరనరల్ ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని యూఎన్‌వో జనరల్ సెక్రెటరీ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. ఉగ్రవాదులు,రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఆయనో మాయని మచ్చ అని తీవ్ర విమర్శలు ఏశారు. గుటెరస్ ఉన్నా.. లేకపోయినా తమ పౌరులను రక్షించేకునే సత్తా ఇజ్రాయెల్‌కు ఉందని ప్రకటించారు.
ఇరాన్ తప్పు చేసింది..
ఇదిలా ఉంటే.. క్షిపుణులతో దాడిచేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని నెతన్యాహు ప్రకటించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భద్రతా కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. అయితే తమపై చేసిన క్షిపిణిదాడిలో ఇరాన్ విఫలమైందని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యాధునిక డిఫెన్స్ వ్యవస్థతోనే సాధ్యమైందని తెలిపారు. తమకు అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.