Saudi Vs UAE: యెమెన్.. ప్రపంచంలో అత్యంత పేద దేశం. అంతర్యుద్ధంతో నలిగిపోయే దేశం. 1990లో ఉత్తర, దక్షిణ యెమెన్‌లు ఏకమై నూతన యెమెన్‌గా ఆవిర్భవించింది. సోవియట్ యూనియన్ పతనానంతరం ఈ ఐక్యత ఏర్పడినా, అయితే 1994లో దక్షిణ భాగం విడిపోవాలని ప్రయత్నించింది. సాయుధ సంఘర్షణలు జరిగి కలిపి నిలిపారు. ప్రస్తుంది హూతీ తిరుగుబాటు గుండెల్లో ఆంతరిక కలహాలు కొనసాగుతున్నాయి.
హూతీలు, సున్నీల మధ్య ఘర్షణ..
2015లో ఇరాన్ మద్దతుతో హూతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నారు. షియా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ సున్నీ కూటమి ఏర్పాటు చేశాయి. దక్షిణ యెమెన్‌లో సదన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్‌ను స్థాపించాయి.
సౌదీ–యూఏఈ మధ్య పోటీ
సౌదీ అరేబియా ప్రెసిడెన్షియల్ కౌన్సిల్‌ను సమర్థిస్తూ యెమెన్ ఐక్యత కోరుకుంటోంది. యూఏఈ అయిదర్ అల్ జుబేదీ నేతృత్వంలోని సదన్ కౌన్సిల్‌కు మద్దతు ఇస్తోంది. హూతీలు సనా, హజా, అల్ జుబేదా ప్రాంతాలను నియంత్రిస్తున్నారు. సౌదీ కొన్ని ప్రాంతాల్లో పట్టు కలిగి ఉంది. ఆయిల్ రిజర్వులు ఉన్న హద్రమాత్‌పై రెండు దేశాలు దృష్టిపెట్టాయి.
గ్లోబల్ ట్రేడ్ చోక్‌పాయింట్‌లు
బాబ్ అల్ మండబ్, హార్ముజ్ స్ట్రెయిట్, ఆడెన్ గల్ఫ్ వంటి మార్గాలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశానికి కీలకం. ప్రపంచ సరుకు రవాణాలో ఆరో భాగం ఇక్కడి నుంచి సాగుతుంది. సౌదీ హద్రమాత్ మార్గాలు కోరుకుంటోంది. యూఏఈకి ఆడెన్, సుకోత్రా ఐలాండ్‌లు ఉన్నాయి. 2025 డిసెంబర్‌లో రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి.
సౌదీ, యూఏఈతో భారత్‌కు బలమైన వాణిజ్య, కార్మిక సంబంధాలు ఉన్నాయి. యూఏఈతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒమాన్‌తో సెపా ఒప్పందం, సౌదీతో చర్చలు జరుగుతున్నాయి. ఘర్షణలు తీవ్రమైతే భారతీయుల మనుగడ, ఆయిల్ సరఫరాలు ప్రమాదంలో పడతాయి. పాకిస్తాన్‌కు కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, జాగ్రత్త అవసరం.