RK Roja: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో దూకుడు కలిగిన నేతలు చాలామంది ఉన్నారు. అయితే అది పార్టీ ప్రయోజనానికో.. రాష్ట్ర ప్రయోజనాల కోసమో ఆ దూకుడు ప్రదర్శించి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ ప్రత్యర్థులను తూలనాడేందుకు మాత్రమే అన్నట్టు కొంతమంది నేతలు ఉండేవారు. వారికి చిన్న పెద్ద తారతమ్యం ఉండేది కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేవారు. వైసిపి అధికారం కోల్పోయేసరికి చాలామందికి తెలిసి వచ్చింది. దూకుడు తనం మాటున బూతులు మాట్లాడే నేతల తీరుతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. అయితే చాలామంది వైఖరి కూడా మారింది. కొడాలి నాని లాంటి నేతలు తమ నోటిని అదుపులోకి తెచ్చుకున్నారు. పొదుపుగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేదు మహిళా నేత రోజా. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
* పవన్ కళ్యాణ్ కు గౌరవం..
మూడు పార్టీల మధ్య పొత్తు ఉంది ఏపీలో. ఆ పొత్తు కుదుర్చింది పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan). కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించింది. అయితే ఇప్పటికి రోజా లాంటివారు పాత పాటలు పాడుతున్నారు. ఒంటరి పోరాటం అంటూ చెబుతున్నారు. ఇప్పటికీ జన సైనికులు జెండా కూలీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మూడు పార్టీల మధ్య పొత్తు ఉంది. పొత్తు కుదిర్చిందే పవన్ కళ్యాణ్. అటువంటప్పుడు జనసేన శ్రేణులు సైతం మూడు పార్టీల జెండాలు పట్టుకోవాల్సిందే కదా. అటువంటప్పుడు జెండాలు పట్టడంలో తప్పు ఏంటి? బిజెపి శ్రేణులు పట్టుకోవడం లేదా? లేకుంటే టీడీపీ శ్రేణులు పట్టుకోవడం లేదా? అసలు రోజాకు వచ్చిన బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ టిడిపి తో ఉండకూడదు. టిడిపి తో పొత్తు పెట్టుకోకూడదు. ఎవరికి వారు విడిగా ఉంటే అధికారంలోకి వచ్చేయాలన్నది రోజా భావన. అయితే ఆమె ఎలా భావించినా పర్వాలేదు కానీ.. జెండా మోసే కూలీలు అంటూ వర్ణించడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ పార్టీ కార్యకర్త అయినా ఆ పార్టీకి జండా కూలీ ఏ కదా.
* జన సైనికులు ఫైర్..
ఇంతటి ఓటమి ఎదురైనా రోజా( RK Roja) నోటికి మూతపడకపోవడం తో జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి రాజశేఖరరెడ్డిని రోజా తిట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని సైతం అనుచితంగా మాట్లాడారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. తరువాత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై నిరంతరాయంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ని తిట్టే కేసీఆర్ కు ఇంటికి పిలిచి చేపల చారు పెట్టించారు. ఇలా ఎన్నెన్నో కామెంట్స్ ఇప్పుడు రోజాపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అయితే ఈమె ఎలా భావిస్తుందో తెలియదు. మొన్న ఓడిపోయిన తర్వాత కొడాలి నాని లాంటి వారే సైలెంట్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈమె పరిస్థితి ప్రస్తుతం బాగా లేదట. అందుకే మరోసారి పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులను టార్గెట్ చేసుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమే ఇలాంటి మాటలు ఆడుతున్నారని జన సైనికులు భావిస్తున్నారు. త్వరలో నగిరి నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జి వస్తారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రోజా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఆమె కామెంట్స్ కు గట్టిగానే బదులిస్తున్నారు జనసైనికులు.