S-400 vs Iron Dome: మన శరీరం విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు.. దేశం విషయంలో ఎలా ఉండాలి.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ.. శత్రువుల వల్ల ఉన్న ఇబ్బందుల వల్ల కొన్ని దేశాలు రక్షణ వ్యవస్థలను అత్యంత సమర్థవంతంగా ఏర్పాటు చేసుకుంటాయి. అందులో ప్రథమ స్థానంలో ఉండేది ఇజ్రాయిల్. ఈ దేశానికి చుట్టూ శత్రువులే ఉన్నారు. అందువల్లే తనని తాను కాపాడుకోవడానికి ఏకంగా ఐరన్ డోమ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆ మధ్య హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఐరన్ డోమ్ లో ఉన్న ప్రతికూలతలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆ వ్యవస్థను మొత్తం ఇజ్రాయిల్ సమర్ధవంతం చేసుకుంది. అనంతరం ఇరాన్, ఇరాక్, హమాస్ వంటి ప్రతీపశక్తులు అనేక దాడులు చేసినప్పటికీ ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకున్నది. ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలోనూ ఇజ్రాయిల్ దేశాన్ని ఐరన్ డోమ్ కాపాడుతున్నది. రాకెట్స్, ఆర్టిలరీ, మోర్టర్ షెల్స్ వంటి షార్ట్ రేంజ్ దాడుల నుంచి ఐరన్ డోమ్ సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది.. నాలుగు నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లో ప్రమాదాలను గుర్తించి ధ్వంసం చేస్తుంది.. ఇంటర్ సెప్టార్ మిసైల్స్ ఎస్ -400 తో పోల్చి చూస్తే చాలా చీప్.
Also Read: Israel – Iran War : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్ పై యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. దాడులు షురూ..
ఎస్ -400 ఎలా పని చేస్తుందంటే..
ఇటీవల కాలంలో ఉగ్రవాద దేశం మన మీద దాడులకు ప్రయత్నించినప్పుడు ఎస్400 సమర్ధవంతంగా ఎదుర్కొంది.. ముఖ్యంగా లాంగ్ రేంజ్ లో జెట్స్, బాలిష్టిక్ మిస్సయిల్స్, డ్రోన్స్ ను కూల్చివేస్తుంది.. 400 కిలోమీటర్ల రేంజిలో క్షిపణులను గుర్తించి దొంగతనం చేస్తుంది. ఎస్ -400 కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది రక్షణ కల్పిస్తుంది. రష్యా మనకు ఈ సాంకేతికతను అందించినప్పటికీ.. దీనికి దేశీయ పరిజ్ఞానాన్ని జోడించి భారత్ అభివృద్ధి చేసింది. ఒకరకంగా దేశం చుట్టూ అద్భుతమైన రక్షణ చత్రాన్ని ఏర్పాటు చేసుకుంది. అందువల్లే ఉగ్రవాద దేశం రకరకాల నక్కజిత్తులు వేసినప్పటికీ.. భారీ స్థాయిలో నష్టం చోటు చేసుకోలేదు. అలాగని చెప్పుకునే స్థాయిలో కూడా ఇబ్బంది కలగలేదు.. అందువల్లే ప్రపంచం మొత్తం మన పోరాటపటి మను ఆసక్తిగా గమనించింది. మన రక్షణ వ్యవస్థను వెయ్యినోళ్ల పొగిడింది. ఎప్పుడైతే ఎస్ 400 ద్వారా భారత్ తనను తాను కాపాడుకుందో.. అప్పుడే శ్వేతదేశం గోల్డెన్ డోమ్ ను ఏర్పాటు చేసుకుంటున్నది.