Russian Ukraine War: రష్యా–ఉక్రెయిన్ వార్ రావణ కాష్టాన్ని తలపిస్తోంది. మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు రష్యాను ఎదురించే శక్తి లేకపోయినా యురోపియన్ యూనియన్, అమెరికా అండతో రెచ్చిపోతోంది. వారి ఆయుధాలతో రష్యా దాడులను ప్రతిఘటిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో తీవ్ర నష్టం జరిగింది. రష్యాలో కూడా పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మరోమారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో ట్రంప్ భేటీ కావాలని నిర్ణయించారు. ఈ భేటీకి ముంద రష్యా అధ్యక్షుడు పుతిన్.. అగ్రరాజ్యాధినేతకు షాక్ ఇచ్చాడు. ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించాడు.
కీవ్ చుట్టూ విధ్వంసం..
డిసెంబర్ 27 రాత్రి రష్యా అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. హైపర్సోనిక్ కింజాల్, నాలుగు ఇస్కందర్ బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ ఆయుధాలు కీవ్, పరిసరాల్లో పేలాయి. బ్రావరీలో విద్యుత్ కట్ అవ్వడంతో నగరాలు అంధకారంలో ఉన్నాయి. మేయర్ క్లిటో‡్ష్క టెలిగ్రామ్‌లో బంకర్లకు వెళ్లిపోయారు. ట్రంప్–జెలెన్సీ్క ఫ్లోరిడా భేటీకి గంటల ముందు జరగడం రష్యా సందేశాన్ని బలపరుస్తుంది.
ట్రంప్–జెలెన్సీ్క చర్చలు..
జెలెన్సీ్క భేటీ ఖాయమని ప్రకటించారు. 90% పూర్తయిన 20 అంశాల శాంతి ప్రతిపాదనతో వెళ్తున్నారు. ట్రంప్ స్పష్టంగా ‘నా అనుమతి లేకుండా ఎలాంటి డీల్ జరగదు‘ అన్నారు. ఈ భేటీ యుద్ధ ముగింపు మార్గాలను నిర్ణయిస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అమెరికా ప్రభావం రష్యా ఉత్కంఠ కలిగిస్తోంది. ట్రంప్ మధ్యస్థత ఉక్రెయిన్‌కు ప్రయోజనం కలుగుతుందా లేక రష్యాకా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దాడిని సమర్థించుకున్న రష్యా..
భేటీకి ముంద జరిపిన దాడిని రష్యా సమర్థించుకుంది. రక్షణ శాఖ ప్రకారం, ఉక్రెయిన్ పౌర ప్రాంతాలపై దాడులకు బదులుగా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపింది. భూభాగంలో అధికారం పెరుగుతోందని ప్రకటించారు. ఈ వాదన యుద్ధాన్ని సమర్థించుకోవడానికి రష్యా వాడుతున్న డిఫాల్ట్ టాకింగ్ పాయింట్. ఈ దాడులు రష్యా సైనిక శక్తిని ప్రదర్శిస్తూ, శాంతి చర్చల్లో బలవంత స్థానాన్ని పొందాలని సూచిస్తాయి.
యుద్ధం ముగియదా?
ఇదిలా ఉంటే..ట్రంప్ జోక్యంతో మెగోటియేషన్ మొదలవ్వవచ్చని తెలుస్తోంది. ఎయిర్ షీల్డ్ సామర్థ్యం బయటపడుతుంది. అయితే నగరాల అంధకారం హ్యూమానిటేరియన్ క్రై సిస్‌ను పెంచుతుంది. రష్యా డీల్ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఐరోపా ఎనర్జీ క్రై సిస్ మళ్లీ ముంచుతుంది. రష్యా ఆక్రమణలు కొనసాగితే శాంతి దూరమవుతుంది. ప్రపంచ దేశాలు చర్చలతో ఒత్తిడి పెంచాలి.
BREAKING: RUSSIA LAUNCHES MASSIVE MISSILE STRIKE ON KYIV HOURS AFTER ZELENSKY SAID HE’S READY TO HOLD REFERENDUM ON TRUMP’S PEACE PLAN
The Ukrainian capital came under massive attack early Saturday, with air defenses in operation and large-scale power outages hitting the… pic.twitter.com/SNb68IIN5W
— Mario Nawfal (@MarioNawfal) December 27, 2025