https://oktelugu.com/

Russia : ఇదెక్కడి చోద్యం.. జనాభా పెంచేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖనా!

పదేళ్ల క్రితం వరకు జనాభా పెరుగుదలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టాయి. కుటుంబ నియంత్రణను తప్పనిసరి చేశాయి. దీంతో జనన రేటు గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు జనన రేటు పెంపునకు పలు దేశాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2024 10:31 pm

    Russia, population growth

    Follow us on

    Russia : దశాబ్దం క్రితం వరకు జనాభా పెరుగుదల ప్రపంచంలో చాలా దేశాలకు పెద్ద సమస్యగా మారింది. జనాభా తగ్గించాలని గగ్గోలు పెట్టేవి. కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేశాయి. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాయి. చైనా అయితే.. జనాభా తగ్గించేందు ఒక్కరు చాలు అనే నిబంధన పెట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు జనాభా సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. జననరేటు భారీగా పడిపోవడంతో యువ జనాభా తగ్గుతోంది. వృద్ధులు పెరుగుతుఆన్నరు. దీంతో ఇప్పుడు నాడు పిల్లలు వద్దన్న ప్రభుత్వాలే ఇప్పుడు పిల్లల్ని కనండి ప్లీజ్‌ అంటున్నాయి. ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. జననాల రేటు పెంపునకు తీసుకుంటున్న చిత్ర విచిరత్రనిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కొన్ని దేశాల్లో జనాభా పెంచేందుఉ స్కీంలు పెడుతున్నాయి.

    రష్యాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ..
    రష్యాలో జనాభా దారుణంగా పడిపోతోంది. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జననాల రేటు పనెంచేందకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తాజాగా జనన రేటు పెంపునకు రష్యా ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంటే అక్కడ జనాభా సంక్షోభం ఎంత దారుణంగా ఉందో అర్తం చేసుకోవచ్చు. పని ప్రదేశాల్లో కూడా జంటలు పిల్లలు కనే ప్రయత్నం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. బెడ్‌రూంలోకి ఎంటర్‌ అయిన రష్యా అధికారులు.. దంపతులు బెడ్‌రూంలోకి రాగానే సెల్‌ఫోన్‌ చూస్తూ టైంపాస్‌ చేయకుండా పిల్లలను కనే పని పని మొదలు పెట్టాలని సూచిస్తోంది. ఈమేరకు నిబంధన తీసుకు వచ్చారు. పిల్లలను కనే జంటలకు రూ.4 వేల ప్రోత్సహకం అందిస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలకు హోటల్‌లో గడిపేందుకు ఖర్చుల కింద రూ.22 వేలు అందిస్తోంది. 18 నుంచి 23 ఏళ్ల వయసు మహిళలకు బిడ్డలను కనేలా రూ.98.029 అందిస్తోంది. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల పారితోషికం ఇస్తోంది.

    దక్షిణ కొరియా
    ఇక దక్షిణ కొరియాలో కూడా జననాల రేటు ఘోరంగా తగ్గుతోంది. అక్కడి ప్రభుత్వం జనాభా పెంచేందకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. పార్కులు, పబ్లిక్‌ మ్యూజియంలలో వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. జంటలుగా మారితే రూ.30,270 చెల్లిస్తోంది. వివాహం గురించి మాటలు జరిగితే ఏకంగా రూ.60,540 అందిస్తోంది. పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.12,10,810 చెల్లిస్తోంది.

    జపాన్‌
    ఇక జపాన్‌ కూడా వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ.3 లక్షలకుపైగా గిఫ్ట్‌ ఇస్తోంది. అయితే అంతగా వర్కౌట్‌ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ఆకర్షించేలా వివాహానికి సబంధించిన పథకం ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

    చైనా..
    ఒకప్పుడు అధిక జనాభాతో ఇబ్బంది పడిన చైనా కూడా ఇప్పుడు జనన రేటు పెంపునకు ప్రయత్నిస్తోంది. పాలసీలు అమలు చేస్తోంది. పిల్లల్ని కనాలని ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తోంది. మూడో బిడ్డ కనేవారికి రూ.3 లక్షల విలువైన సబ్సిడీలు ఇస్తోంది.