https://oktelugu.com/

Robert F. Kennedy : అతని మెదడులోని పురుగు భారత్‌దే అట.. రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ వివాదాస్పద వ్యాఖ్యలు!

అగ్రరాజ్యంలో కొత్తగా కొలువుదీరే డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌లో అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ ఎంపికయ్యారు. జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : November 18, 2024 1:46 pm
Robert F. Kennedy

Robert F. Kennedy

Follow us on

Robert F. Kennedy : అగ్రరాజ్యాం అమెరికా ఆరోగ్య మంత్రిగా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యక్తిని ఎంపిక చేశాడు. కోరోనా సమయంలో వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నyీ కి ట్రంప్‌ ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఎంపికపైనే అమెరికాలో చర్చ జరుగుతుండగా, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఇటీవలే ట్రంప్‌ రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ(70)ని ఆరోగ్య మంత్రిగా నామినేట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కెన్నడీ జూనియర్‌ జీవన శైలి, ఆరోగ్య వివరాల గురించి ప్రజలు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మెదడులో పురుగు ఉన్న విషయాన్ని గుర్తించారు. దానిని భారత్‌తో ముడిపెడుతూ గతంలో చేసిన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

ఏం జరిగిందటే..
2010లో రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యాడు. ఇది ఆయన మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది. వైద్యులు తొలుత అతడికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు భావించారు. తర్వాత అతని మెదడులో ఓ పురుగు ఉన్నట్లు గుర్తించారు. చికిత్స తర్వాత కెన్నడీ కోలుకున్నారు. తర్వాత ఇచ్చిన ఓ ఇంటరన్వూ్యలో తన మెదడులో పురుగు ఉన్న విషయాన్ని తెలిపారు. తన కెరీర్‌ ప్రారంభంలో భారత్‌కు ఎక్కువగా వెళ్లేవాడినని, బహుశా ఆ సమయంలో భారత్‌లో సరిగ్గా ఉడకని మాసం తిని ఉంటానని తెలిపారు. ఆ మాంసంలోని పరాన్న జీవి తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

పాదరసం ప్రభావంతో..
తాను గతంలో ట్యూనా ఫిష్‌ శాండ్‌విచ్‌లు ఎక్కువగా తినేవాడినని, మంచినీటి చేపలను తినేవాడినని రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ తెలిరు. అయితే ఆ పురుగుల వల్ల కాకుండా చేపల్లో అధిక పాదరసం మోదతాదుల కారణంగానే నా మెదుడ పనితీరుపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నానని తెలిపారు. తర్వాత కఠినమైన ఆరోగయ నియమాలు పాటించి కోలుకున్నట్లు చెప్పారు. రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ పదేళ్ల క్రితమే పూర్తిగా కోలుకున్నానని, శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నారని ఆయన ప్రతినిధి ఈ ఏడాది ఆరంభంలో తెలిపారు.

రాజకీయ వారసత్వం..
అమెరికాలో ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడు రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ. న్యాయవాదిగా ఉన్న కెన్నడీ జూనియర్‌ మాజీ అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ కుమారుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నడీకి సమీప బంధువు. కోవిడ్‌ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా కెన్నడీ జూనియర్‌ అమెరికాలో పెద్ద పోరాటమే చేశారు.