https://oktelugu.com/

China : చైనావోడి బుర్రే బుర్ర.. ఆఖరకు అంతరిక్షంలోనూ వాటిని పెంచారు!

చైనా.. చీటింగ్‌లోనూ.. డ్లూప్లికేట్స్‌ తయారీలోనూ ముందుండే కంట్రీ. చైనీయులు కాపీ కొట్డడంలో ముందు ఉంటారన్న అవవాదు ఉంది. ఒక వస్తువు మార్కెట్‌లోకి రాగానే.. తక్కువ ధరలో దానికి డూప్లికేట్‌ తయారు చేస్తారు.

Written By: Raj Shekar, Updated On : November 18, 2024 1:32 pm
China

China

Follow us on

China :  డ్రాగన్‌ కంట్రీ చైనా.. ప్రపంచాన్ని ఏలాలని కలలు కంటోంది. అందుకే ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే.. ఇదే చైనా.. ఎదుగుతున్నదేశాలను దెబ్బతీయడానికి వంకర బుద్ధి ప్రదర్శిస్తోంది. తాను తయారు చేసిన యాప్స్‌ను విదేశాల్లోని ఫోన్లలోకి పంపుతూ సొమ్ములు కాజేస్తోంది. ఇక గేమింగ్‌ యాప్స్‌తో చీటింగ్‌ చేస్తోంది. ఇక డూప్లికేట్‌ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చైనా.. ప్రపంచలో నూతనంగా ఆవిష్కరించే ప్రతీ వస్తువు చీప్‌గా వచ్చేలా డూప్లికేట్‌ తయారు చేయడంలో దిట్ట. అయితే ఈసారి మాత్రం చైనా సరికొత్త ఆవిష్కరణ చేసింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. తన వ్యోమగాములతో ఈ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్షంలో ఏకంగా చేపల పెంపకం చేపట్టింది. నవంబర్‌ 4న ముగిసిన షెన్‌ 18 స్పేస్‌ మిషన్‌లో భాగంగా ఈ ఘటన సాధించింది. చైనా అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదికైంది. వేగంగా పెరిగే జీబ్రా చేపలను పెంచుతున్నారు. వీటికోసం క్లోస్డ్‌ ఎకో సిస్టం ఏర్పాటు చేశారు.

43 రోజుల్లో..
చేపలు పెరిగేందుకు అనూకూల వాతావరణం కల్పించడంతో.. క్లోజ్డ్‌ సర్క్యూట్‌లో పెరిగిన చేపలు పునరుత్పత్తి కూడా చేశాయి. దీంతో 43 రోజుల జీవన చక్రాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేశాయి. అంతరక్ష ప్రయోగాల్లో ఇది సరికొత్త చరిత్రగా నిలిచింది. అంతరిక్షంలో అత్యంత సవాళ్లతో కూడిన వాతావరణంలో జలచరాలు ఏమేరకు మనుగడ సాగించగలవన్నదానిపై ఈ ప్రయోగం ద్వారా స్పష్టత వచ్చిందని సైంటిస్టులు అంటున్నారు. అంతరిక్షరంగంలో చైనా కొంతకాలంగా పైచేయి సాధిస్తోంది. తాజాగా చేపల పెంపకంతో మరో ముందడుగు వేసింది.

జీబ్రా చేపలంటే..
ఇక చైనా పెంచినవి జీబ్రా చేపలు. వీటికి మానవులతో దగ్గరి పోలికలు ఉంటాయి. అంతరిక్షంలో వీటితో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో చైనా కీలక మైలురాయిని అధిగమించింది. భూమికి అవతల శాశ్వత మానవ ఆవాసాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఇక మరింత ఊపందుకునే అవకాశం ఉంది. 30 ఏళ్లలో అంగారకుడిపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకోవాలన్న ఎలాన్‌ మస్క్‌ ప్రయోగాలకు ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.