Travel: ట్రావెలింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ వ్యక్తిగత కారణాలు, డబ్బులు, సమయం లేకపోవడం వల్ల ఎక్కువగా ట్రావెల్ చేయలేరు. ట్రావెల్ చేయడం వల్ల కొందరికి హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు. డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా విముక్తి చెందాలని, గతంలో జరిగిన విషయాలను మర్చిపోవాలని కొందరు ఎక్కువగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే చాలా మంది వింటర్ సీజన్‌లో ఎక్కువగా వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే శీతాకాలంలో కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా మంచిగా ఉంటాయి. వీటిని చూస్తే మనస్సులో ఎంత బాధ ఉన్న కూడా మర్చిపోతారు. శీతాకాలంలో తెల్లని మంచుతో కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మన ఇండియాలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో పర్వతాలను చూడాలని అనుకుంటారు. అయితే వింటర్ సీజన్‌లో మన ఇండియాలో తప్పకుండా వెళ్లాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలేంటో తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఏపీలోని అరకు
డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో తప్పకుండా ఏపీలోని అరకు వ్యాలీని చూడాల్సిందే. చలికాలంలో తెల్లని పొగమంచుతో, కొండల మధ్య పచ్చని చెట్లు ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చని తోటలు చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లేస్‌ను మిస్ కావద్దు.
కేరళలోని మున్నార్
ప్రకృతి అందాలకు ప్రసిద్ధి కాంచినది కేరళ. ఇక్కడ ఉండే మున్నార్ ప్లేస్ చలికాలంలో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కాఫీ తోటలు, అందమైన డ్యామ్‌లు చూస్తే లైఫ్‌లో ఆ ఫీలింగ్‌ను మర్చిపోరు. అసలు అక్కడి నుంచి తిరిగి రావాలని కూడా అనిపించదు.
కర్ణాటకలోని కూర్గ్
ట్రెక్కింగ్, జలపాతాలు, పార్క్‌లు అంటే బాగా ఇష్టపడేవారు కర్ణాటకలోని కూర్గ్ వెళ్లాల్సిందే. చలికాలంలో చల్లగా, మంచుతో ఉన్న వాతావరణంలో కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తే ఉంటుంది.. ఆహా ఊహించుకుంటేనే ఇలా ఉంది. అలాంటిది లైవ్‌లో చూస్తే ఎలా ఉంటుందో మరి చూద్దాం.
వయనాడ్
కేరళలోని వయనాడ్ అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ అందమైన అడవులు, చెట్లు, జలపాతాలు ఎంతో అందంగా ఉంటాయి. తప్పకుండా ఈ సీజన్‌లో వయనాడ్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి చాలా మంది వెళ్తుంటారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌లో చూస్తే వావ్ అనాల్సిందే.
కూనూర్
టీ ఎస్టేస్ట్స్ ఎక్కువగా ఉండే కూనూర్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా డాల్పిన్ నోస్, లాంబ్స్ రాక్ వ్యూ వంటివి ఉన్నాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చలికాలంలో ఈ ప్లేస్‌లు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మంచు కొండల మధ్య ప్రకృతి అందాలు తప్పకుండా ఈ సీజన్‌లో చూడాల్సిందే.