https://oktelugu.com/

Indian companies : బంగ్లాదేశ్ లో అల్లర్లు తీవ్రరూపం.. భారత కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుందా?

బంగ్లాదేశ్ లో తీవ్రరూపం దాల్చిన అల్లర్ల ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతున్నది. ఇప్పటికే బంగ్లాదేశ్ ల్ ఎల్ఐసీ కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇక మరికొన్ని కంపెనీలు అదే బాట పడుతున్నాయి. ఇందులో ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 / 08:29 PM IST
    Follow us on

    Indian companies : బంగ్లాదేశ్ లో ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన హింప తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశం వదిలి భారత్ మీదుగా లండన్ వెళ్లిపోయారు. ఇక సైన్యం దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతున్నది. దీంతో భారత కంపెనీలపై దీని ప్రభావం పడింది. మారికో, ఇమామీ, డాబర్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టాటా మోటర్స్, హీరో మోటర్ కార్ప్ లపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. మరికొన్ని కంపెనీలపై కూడా దీని ప్రభావం ఉంది. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఆందోళనకారులు తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని, రిజర్వేషన్లు ఎత్తివేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు సమాచారం అందుతున్నది. దేశంలో ఇప్పటికే అల్లర్ల కారణంగా వందలాది మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఇక ఈ నైపథ్యంలో సైనికాధ్యక్షుడి నేతృత్వంలో తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. విద్యాసంస్థలు తెరుచుకోలేదు. దీంతో ఈ ప్రభావం భారత్ కంపెనీలపై పడింది. అయితే బంగ్లాదేశ్ లోని తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఎల్ ఐసీ ప్రకటించింది. ఈ నెల 7 వరకు కర్ఫ్యూ నేపథ్యంలో తమ కార్యాలయాన్ని తెరవబోమని, వినియోగదారులకు సంస్థ ప్రకటన విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక మరికొన్ని కంపెనీల ప్రాంఛైజీలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగంపై కూడా ఈ అల్లర్ల ప్రభావం కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ లో పెట్టుబడులు పెట్టిన భారత కంపెనీల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంత ఇబ్బందులు తప్పవని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

    వస్ర్తరంగానికి మాత్రం పెరిగిన ఆర్డర్స్
    బంగ్లాదేశ్ లో అనిశ్చితి కారణంగా భారత టెక్స్ టైల్ రంగానికి ఆర్డర్స్ పెరిగినట్లు కనిపిస్తున్నది. ఇది గతంలో కంటే పదిశాతం పెరిగిందని తెలుస్తున్నది. ఇక అమెరికా, యూరప్ లలోని ప్రధాన బ్రాండ్లు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇది భారతీయ వస్ర్త పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. అయితే బంగ్లాలో అల్లర్లపై కేంద్రం సునీశితంగా పరిశీలిస్తున్నది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులతో పాటు ప్రధాన భద్రతాధికారులతో సమావేశమయ్యారు.

    ఎప్పటికప్పుడు బంగ్లాలో పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బంగ్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలను సన్నద్ధం చేసి ఉంచారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందని బీఎస్ఎఫ్ తో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సన్నద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇదే క్రమంలో షేక్ హసీనాను భారత్ నుంచి లండన్ కు సురక్షితంగా పంపించడంలో భారత ప్రభుత్వం సహకరించినట్లుగా తెలుస్తున్నది.