Bangladesh : మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. పైగా అక్కడ అంతకంతకు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ, ప్రవేట్ ఆస్తులను ఆందోళనకారులు లూటీ చేస్తున్నారు. పలు భవనాలకు నిప్పు పెడుతున్నారు. హత్యలు, హింసాకాండ దర్జాగా సాగిపోతోంది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలు కట్టు తప్పుతున్న నేపథ్యంలో అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. అయినప్పటికీ అల్లర్లు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. షేక్ హసీనా రాజీనామా తర్వాత.. తదుపరి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడుతుందో అంతు పట్టకుండా ఉంది. అయితే జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ రద్దు కావడంతో.. ప్రస్తుత పార్లమెంట్ అధ్యక్షుడు మహమ్మద్ షాహబుద్దీన్ రాజకీయ నేతలు, వివిధ దళాధిపతులు, పౌర సంఘాలతో చర్చలు జరిపారు. అనంతరం ప్రస్తుత పార్లమెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత..
ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. ప్రత్యేక అభిమానంలో దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో పరిపాలనను బంగ్లాదేశ్ సైన్యం తమ ఆధీనాలకు తీసుకుంది. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వాకర్ – ఉజ్ – జమాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా సైన్యం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంటు రద్దుకు గురైంది.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకంటే ముందు ఆయన. దేశంలోని రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. త్రివిధ దళాధిపతులతో మాట్లాడారు. పౌర సంఘాలతో చర్చలు జరిపారు. అనంతరం పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు పార్లమెంటు ను రద్దు చేసిన నేపథ్యంలో త్వరలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని అక్కడి సైన్యం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
రాజకీయ అస్థిరత
బంగ్లాదేశ్లో ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన నేపథ్యంలో రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. నిరసనలు తీవ్ర రూపు దాల్చడంతో ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ఆర్మీ ప్రత్యేక విమానంలో బంగ్లా మీదుగా ఢాకా ప్యాలెస్ ను విడిపోయారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్ చేరుకున్నారు. భారత భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ రంగంలోకి దిగింది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ఇక ప్రస్తుతం దేశంలో పరిపాలన ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ అధికారులు హింస ను అరికట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం కావడం లేదు. అల్లరి మూకలు అంతకంతకూ రెచ్చిపోతున్నాయి. ఇళ్లపై దాడులు చేస్తూ లూటిలకు పాల్పడుతున్నాయి. మారణాయుధాలతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ అల్లర్లలో ఇప్పటివరకు వందలాది మంది చనిపోయినట్టు తెలుస్తోంది.
బయటికి వచ్చే పరిస్థితి లేదు
ఆర్మీ చేతుల్లోకి పరిపాలన వెళ్లిపోయిన నేపథ్యంలో జనం బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చిన్నచిన్న అవసరాలు మినహా, ఇతర ఏ పనులు కూడా చేసుకోకుండా అవుతోందని ప్రజలు చెబుతున్నారు. అక్కడ పరిపాలన ఆర్మీ చేతుల్లోకి వెళ్లడంతో అధికారులు చెప్పిందే శాసనమౌతోంది. ఏమాత్రం గీత దాటినా ఆర్మీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని సాధారణ పౌరులు వాపోతున్నారు.