https://oktelugu.com/

Rent a Girl or Boy Friend: మీరు సింగిల్‌ హా.. అయితే ఈ స్టోరీ మీ కోసమే!

సాధారణంగా గదులు, దుస్తులు, సామానులు వంటివి అద్దెకి ఇస్తారు. కానీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ను అద్దెకు ఇస్తారనే విషయం మీకు తెలుసా? అయితే ఇది మన దేశంలో కాదు. అభివృద్ధిలో దూసుకుపోతున్న జపాన్‌లో గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌ను రెంట్‌కి ఇస్తారు. అసలు ఎందుకు ఇలా? ఈ విధానం ఎలా వచ్చిందో? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 16, 2024 / 07:31 PM IST

    love couples

    Follow us on

    Rent a Girl or Boy Friend: ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలు, వింతలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ప్రదేశాలను బట్టి వాటి సంప్రదాయాలు మారిపోతుంటాయి. ఇండియాతో పోలిస్తే మిగతా దేశాలు సంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయి. పాశ్చాత్య దేశాలు మన కంటే ఓ 20 ఏళ్లు ముందుగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇండియాలో చూసుకుంటే ఎప్పుడో పాశ్చాత్య దేశాల్లో ఉండే కల్చర్ ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉండటం ఒక ట్రెండ్ అయిపోయింది. అసలు లవర్ ఉన్నవారిని కంటే లేని వారిని చూసే షాక్ అవుతున్నారు. అలా ట్రెండ్ మారింది. సాధారణంగా గదులు, దుస్తులు, సామానులు వంటివి అద్దెకి ఇస్తారు. కానీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ను అద్దెకు ఇస్తారనే విషయం మీకు తెలుసా? అయితే ఇది మన దేశంలో కాదు. అభివృద్ధిలో దూసుకుపోతున్న జపాన్‌లో గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌ను రెంట్‌కి ఇస్తారు. అసలు ఎందుకు ఇలా? ఈ విధానం ఎలా వచ్చిందో? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

     

    ప్రతి ఒక్కరికి లైఫ్‌లో అన్ని విషయాలు షేర్ చేసుకునే ఒక వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. వాళ్ల బాధలను ఎవరితో షేర్ చేసుకోకుండా మనస్సులోనే నలిగిపోతుంటారు. ఇలాంటి వారి బాధలను చూడలేక జపాన్ ప్రభుత్వం రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ విధానాన్ని తీసుకొచ్చింది. బాధలు షేర్ చేసుకోకపోవడం వల్ల ఒంటరితనానికి ఎక్కువగా బానిస అవుతున్నారు. దీని నుంచి విముక్తి కల్పించడానికి జపాన్ ప్రభుత్వం అద్దె పార్ట్‌నర్‌ పథకాన్ని ప్రారంభించింది. గంటలు లేదా రోజులు ఇలా పార్ట్‌నర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వైబ్‌సైట్‌లను కూడా ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం అనుమతి ఉన్న వెబ్‌సైట్‌లలో మాత్రమే అద్దె తీసుకోవాలి. అయితే ఈ స్కీమ్‌లో ఎక్కువ ఖరీదుకే పార్ట్‌నర్‌లను అద్దెకు తీసుకోవాలి. కనీసం గంటకు రూ.3 వేల రూపాయిలు అద్దె కట్టాలి. అయితే కేవలం గంటకు బుక్ చేసుకోవడం కుదరదు. రెండు గంటల పాటు తప్పకుండా బుక్ చేసుకోవాలి.

     

    ఈ స్కీమ్‌లో మొదటిసారి ఉచితమే. తర్వాత నుంచి మనమే బుక్ చేసుకోవాలి. అయితే మీకు నచ్చిన అమ్మాయి రాదు. నచ్చిన అమ్మాయి కావాలంటే మళ్లీ రూ. 1200 కట్టాలి. అప్పుడే మీరు కోరిన పార్ట్‌నర్‌ను అద్దెకు ఇస్తారు. అయితే ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి. అమ్మాయి లేదా అబ్బాయిని రెంట్ తీసుకుంటే డైరెక్ట్‌గా వాళ్లతో కాంటాక్ట్ కాకూడదు. అలాగే ఇంప్రెస్ చేయాలని బహుమతులు వంటివి ఇవ్వకూడదు. ఈ రూల్ ఇద్దరికీ వర్తిస్తుంది. ఈ పద్ధతి జపాన్‌లో ఎప్పటి నుంచో ఉందని సమాచారం. 1990 నుంచే ఈ కల్చర్ ఉందని, ప్రస్తుతం ఇంకా పెరిగిందని తెలుస్తోంది. ఇండియాలో ఇదే స్కీమ్ వస్తుందో? రాదో? ఒకవేళ వస్తే కనీసం 20 ఏళ్లు అయిన పట్టొచ్చు. మరి ఈ స్కీమ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.