Blinkit : గతంలో ఏదైనా వస్తువు కొనాలంటే ఏదో ఒక షాపుకి కొనడానికి వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ-కామర్స్ కంపెనీల ప్రవేశంతో కొనుగోళ్ల సరళిలో అనూహ్య మార్పులు వచ్చాయి. ఇంట్లో కూర్చోని కూడా కావలసిన వస్తువును స్టార్మ్ ఫోన్లో ఆర్డర్ చేస్తే చాలు, అది నిమిషాల్లో మీ ఇంటికి చేరుతుంది. 24గంటల్లో ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చే సదుపాయం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు ఇప్పుడు ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్ కంపెనీలు కొత్త నిబంధనలను అనుసరిస్తున్నాయి. వినియోగదారులకు ఇబ్బందులను నివారించడానికి సేవలను మరింత సౌకర్యవంతంగా చేస్తున్నాయి. మామూలుగా ఆన్‌లైన్‌లో బట్టలు, బూట్లు ఆర్డర్ చేసేటప్పుడు, సైజులు సెట్ చేయకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు వారు రిటర్న్ ఎక్స్ ఛేంజ్ చేస్తారు. దీనికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా, వినియోగదారులు ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ బ్లింకిట్ కస్టమర్ల కోసం కొత్త సేవలను ప్రవేశపెట్టింది. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోచే ఆధారితమైన బ్లింకిట్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్ఛేంజ్, రిటర్న్ ఫీచర్‌ను ప్రారంభించింది.
Introducing Easy Returns on Blinkit!
Customers can initiate a return/ exchange in case of a size or fit issue with the delivered product. This solves a crucial problem of size anxiety for categories like clothing and footwear.
The cool part – return or exchange will happen… pic.twitter.com/iWUcoPaOLj
— Albinder Dhindsa (@albinder) October 15, 2024
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ ఎంపిక చేసిన భారతీయ నగరాల్లో దుస్తులు, పాదరక్షలకు 10 నిమిషాల్లో రిటర్న్ ఎక్స్ ఛేంజ్ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ఆన్‌లైన్ షాపర్‌ల సమస్యలను నివారించడమే లక్ష్యంగా ప్రారంభించింది. బ్లింకిట్‌లో ఈజీ రిటర్న్స్ ఫీచర్లో డెలివరీ చేయబడిన వస్తువు సైజు లేదా ఫిట్‌తో సమస్య ఉన్నట్లయితే కస్టమర్‌లు రిటర్న్‌లు/ఎక్స్‌ఛేంజ్‌లను ప్రారంభించవచ్చు. ఇది దుస్తులు, బూట్లు వంటి వర్గాలకు సంబంధించిన సైజు సమస్యను పరిష్కరిస్తుంది. రిటర్న్‌లు లేదా ఎక్స్ఛేంజ్‌లు కస్టమర్ అభ్యర్థించిన 10 నిమిషాల్లోనే ప్రాసెస్ చేయబడతాయి.గత కొన్ని వారాలుగా దీనిని ఢిల్లీ లో ఈ సేవలను కంపెనీ పరీక్షఇంచింది. ఇప్పుడు దీనిని ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణేలకు విస్తరించింది. మరిన్ని రోజుల్లో ఇంకొన్ని నగరాలకు ఈ రిటర్న్ ఎక్స్ ఛేంజ్ సేవలు చేరనున్నాయి.
ఈ మేరకు కంపెనీ సీఈవో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను అంచనా వేయడానికి బ్లింకిట్ ఇప్పటికే ఢిల్లీలో 10 నిమిషాల రిటర్న్ ఎక్స్ ఛేంజ్ సేవను టెస్ట్ చేస్తున్నాం. సానుకూల ఫలితాలు రావడంతో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , పూణే వంటి ప్రధాన నగరాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించాం. మరిన్ని నగరాలు త్వరలో జోడించబడతాయి, ఈ సౌకర్యవంతమైన సేవ విస్తృత కస్టమర్ బేస్‌కు అందుబాటులో ఉంటుంది.’’ అని రాసుకొచ్చారు.