Ghar Vapasi: శ్రీ కృష్ణ పరమాత్ముడు గీతలో అర్జునుడికి బోధించిన శ్లోకం గుర్తుందా? ఒక సారి గుర్తు చేసుకుందాం.
‘శ్రేయాన్ స్వదర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్ఠితాత్..
స్వధర్మే విధనం శ్రేయ: పరధర్మోభయావహః..
‘చక్కగా అనుష్టింపబడిన పరధర్మం కన్నా.. గుణము లేనిదైనను స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే.. పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది.’ ఇది శాక్షాత్ భగవానుడు వివరించాడు. కానీ కొన్ని మిషనరీస్, క్రిస్టియన్ సంస్థలు చాలా మంది హిందువులను మతం మారుస్తున్నాయి. ఇదీ ముఖ్యంగా భారత్, నేపాల్ లాంటి వాటిల్లో మరీ ఎక్కువగా కొనసాగుతోంది. వీరు ఎక్కువగా దళితులను, ఆర్థికంగా వెనుకబడిన వారిని లక్ష్యంగా చేసుకొని మతం మారుస్తుంటారు. ఇలా చాలా మందిని మతం మార్చారు. ఒక్క భారత్ లోనే దాదాపు 2 వంతులకు పైగా క్రైస్తవాన్ని అనుసరిస్తున్నారు. ఇది దేశానికి, ప్రపంచానికి కూడా మంచిది కాదని వైధిక జ్ఞానులు చెప్తున్నారు. అయితే వీరిని తిరిగి వారి పూర్వీకుల మతంలోకి తీసుకవచ్చేందుకు విశ్వహిందూ పరిషత్ లాంటి చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీలు ఒక్కొక్కరిగా సంవత్సరాలు మతం మారుస్తుంటే.. ఘర్ వాపసీ ప్రోగ్రాం చేపట్టి వేలాది మందిని ఒకేసారి తిరిగి తీసుకువస్తున్నారు. ఇలాంటి ఒక ఘటన ఇటీవల నేపాల్ లో జరిగింది.
భారత్ పొరుగు దేశం నేపాల్ లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో 2000 మంది తమ సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది క్రైస్తవులను స్వధర్మంలోకి వచ్చారు. దీంతో వీహెచ్‌పీ ప్రజలందరినీ హిందూ చట్టాల ప్రకారం స్వదేశానికి రప్పించింది. వీరు హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు.
విశ్వహిందూ పరిషత్ నేపాల్ జాతీయ సంస్థ మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు సహా పలువురు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిని వేద మంత్రోచ్ఛారణలతో చట్ట ప్రకారం సనాతన ధర్మంలో చేర్చారు. ఇంతకు ముందు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ముస్లిం వర్గానికి చెందిన 8 మంది హిందూ మతంలోకి మారారు. ఖజ్రానా గణేష్ ఆలయంలో పూజలు నిర్వహించి సనాతన ధర్మంలోకి వచ్చారు.
హిందూ ప్రధాన మతంగా నేపాల్ కానీ..
నేపాల్ దేశం ప్రధానంగా హిందూ మత దేశం. అక్కడ కమ్యూనిస్టుల పాలన ఉన్నా.. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంది. హిందూ మతంను ప్రమాణంగా తీసుకునే అక్కడ చట్టాలు కూడా చేయబడ్డాయి., అయితే ఇటీవల క్రైస్తవం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈస్టర్న్ నేపాల్ లో దీని విస్తృతి మరింత వేగంగా ఉంది. పొరుగున ఉన్న డార్జిలింగ్, సిక్కింకు దగ్గరగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో చాలా గ్రామాలు క్రైస్తవంలోకి మారుతున్నట్లు తెలుస్తుంది.
2008 వరకు నేపాల్ రాజరికంలో ఉండేది. అక్కడి రాజు హిందూ మతమే ప్రధాన మతంగా ఉండేది. 2008 వరకు మత ప్రచారం.. మతం మారడం తీవ్రమైన నేరంగా పరిగణించేవారు. 2008 తర్వాత సెక్యులర్ దేశంగా అవతరించిన మూడేళ్లకు ఆ దేశంలో క్రైస్తవుల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగింది. ప్రస్తుతం 5 లక్షల వరకు ఉన్నారు.
సౌత్ కొరియా ప్రధాన పాత్ర పోషిస్తుందా?
నేపాల్ మత మార్పిడులకు ప్రధాన కారణం సౌత్ కొరియా అని తెలుస్తుంది. ప్రస్తుతం నేపాల్ లో 22 వేలకు పైగా మత మార్పిడులకు సంబంధించి పని చేస్తున్నారు. అక్కడి నుంచే ఎందుకంటే నేపాల్ ఈస్ట్, నార్త్ పార్టుల మాంగోలియన్ జనాభాకు చెందిన వారిగా ఉంటారు. కాబట్టి సౌత్ కొరియా కూడా మాంగోలియన్ జనాభాకు చెందినది కాబట్టి వీరిలో వేగంగా కలిసిపోతారు. ఇది మత మార్పిడులకు కలిసి వచ్చే అంశం. ఈ విధంగా వేగంగా పెరిగిపోతున్న క్రైస్తవం 7000కు పైగా చర్చిలను ఆ దేశంలో నిర్మించగలిగింది. ఇందులో ఎక్కవ తూర్పు నేపాల్ లో ఉన్నాయి.
వలసలు కారణమే..
నేపాల్ కు చెందిన ఎక్కువ మంది చదువుకునేందుకు సౌత్ కొరియాకు వెళ్తుంటారు. గతంలో ఎక్కువ మంది భారత్ కు వచ్చేవారు. ఇంకా కొందరు ఇంగ్లండ్, యూఎస్ దేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సౌత్ కొరియా వెళ్తున్నారు. కారణం ఏంటుంటే.. వీరిని నేపాల్ లోని క్రైస్తవ మిషనరీలు తీసుకెళ్తున్నాయి. అక్కడికి వెళ్లి చదువుకోవడంతో పాటు మతంను కూడా వెంట తీసుకువస్తున్నారు. దీంతో పాటు మత మార్పిడికి కారణం అవుతున్నారు.
ఇలా నేపాల్ చాలా వరకు హిందూ ధర్మాన్ని కోల్పోతుంది. కానీ ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాలు వేగంగా చేపట్టి విశ్వహిందూ పరిషత్ లాంటివి స్వ ధర్మంలోకి తీసుకువస్తున్నాయి
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More