spot_img
Homeఅంతర్జాతీయంBalochistan Liberation Army: క్వెట్టా పై దాడి శాంపిల్ మాత్రమే.. బలూచిస్థాన్ వద్ద తుపాకీ పట్టిన...

Balochistan Liberation Army: క్వెట్టా పై దాడి శాంపిల్ మాత్రమే.. బలూచిస్థాన్ వద్ద తుపాకీ పట్టిన శివంగులు.. పాకిస్తాన్ రోజులు లెక్కబెట్టుకోవడమే

Balochistan Liberation Army: పాకిస్తాన్ దేశానికి గుండెకాయ లాంటి ప్రాంతం క్వెట్టా. మిగతా దేశంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇక్కడ మాత్రం కాస్త వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. పైగా సైనికులను ఈ ప్రాంతం మీదుగా ఉన్న రైలు మార్గాల ద్వారా పాకిస్తాన్ పరిపాలకులు వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. అయితే ఇలా తరలిస్తున్నప్పుడు పాకిస్థాన్ పాలకులు చాలావరకు గోప్యత పాటిస్తూ ఉంటారు. బయటికి సమాచారం వెళ్లకుండా అత్యంత జాగ్రత్త పడుతుంటారు.

పాకిస్తాన్ సైన్యం రైలులో వెళ్తుందని సమాచారాన్ని తెలుసుకున్నారు బలూచిస్తాన్ ఆర్మీ నిర్వాహకులు. వెంటనే ఆ రైలులో ప్రవేశించారు. అయితే సైన్యం ప్రయాణిస్తోంది ఆ రైలులో కాదు. అయినప్పటికీ ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 23 మంది చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఒకరకంగా ఈ దాడి ద్వారా పాకిస్తాన్ దేశానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబ్రరేషన్ ఆర్మీ.

అయితే కేవలం ఈ తరహా దాడులతోనే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆగడం లేదు. కొంతకాలంగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం.. పంజాబ్ రాష్ట్రంలో భాగమైన తమ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తూ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటాలు చేస్తోంది. దాడులకు పాల్పడుతుంది. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధాలు చేస్తోంది. ప్రాణ నష్టం సంభవించినప్పటికీ.. ఆస్తి నష్టం చోటుచేసుకుంటున్నప్పటికీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అయితే పాకిస్తాన్ దేశంలో మహిళల మీద వివక్ష ఉంటుంది. అటువంటి పరిస్థితి తమ మహిళలకు రావద్దని.. తమ మహిళలు అన్ని రంగాలలో ముందుంటారని నిరూపిస్తూ..బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు అతివలకు కూడా ఈ ఉద్యమంలో సింహభాగం దక్కేలా చూస్తున్నారు. అందువల్లే వారిని కూడా యుద్ధ విద్యలో శిక్షణ పొందే విధంగా చేస్తున్నారు.

యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చేటప్పుడు అక్కడికి ఒక్క మగ వ్యక్తి కూడా రావడం లేదు. అదంతా కూడా అక్కడి మహిళా కమాండర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.. రహస్య ప్రాంతాలలో మహిళలకు తుపాకులు ఉపయోగించడంలో షైనాజ్ శిక్షణ ఇస్తున్నారు.. స్వాతంత్ర్యం కోసం మగవాళ్ళు మాత్రమే కాదని.. తాను కూడా పోరాడుతామని ఆమె చెబుతున్నారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో రేయి పగలు అని తేడా లేకుండా ఆమె మహిళలకు తుపాకులను ఉపయోగించడంలో అందిస్తున్న శిక్షణ అద్భుతంగా ఉంది.. అటు మగవాళ్ళు.. ఇటు ఆడవాళ్లు ముకుమ్మడిగా దాడులు చేస్తే పాకిస్తాన్ చాప్టర్ క్లోజ్ అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే క్వెట్టా ప్రాంతంలో జరిగిన దాడి జస్ట్ ఉదాహరణ మాత్రమేనని.. అంతకుమించినవి జరుగుతాయని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దేశానికి హెచ్చరికలు పంపుతోంది

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper