https://oktelugu.com/

PM Modi: మళ్లీ రష్యాకు ప్రధాని మోదీ.. ఈ సారి ఎందుకు వెళ్తున్నారో.. అందరిలోనూ ఉత్కంఠ

ప్రధాని నరేంద్రమోదీ.. మరోమారు రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. 3.0 తర్వాత జూలైలో రష్యాకు వెళ్లిన మోదీ.. అక్టోబర్‌లో మరోమారు వెళ్తున్నారు. అక్టోబర్‌ 22న రష్యాకు బయల్దేరి వెళ్లనున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 19, 2024 10:28 am
PM Modi(3)

PM Modi(3)

Follow us on

PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ మరోమారు రష్యా వెళ్లనున్నారు. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం ఆయన బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అక్టోబర్‌ 22న రష్యా బయల్దేరనున్నారు. రెండు రోజులు అక్కడే ఉండనున్నారు. మరోవైపు మోదీని ఆహ్వానిస్తూ పుతిన్‌ ప్రధానిని తన మిత్రుడిగా అభివర్ణించారు. మూడు నెలల వ్యవధిలో మోదీ.. రెండోసారి రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో జూలైలో మోదీ రష్యా వెళ్లారు. రష్యా నుంచి వచ్చిన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్‌కూడా వెళ్లారు. దీంతో యుద్ధం జరుగుతున్న రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు బీజం పడింది. రెండు దేశాల పర్యటనలో మోదీ యుద్ధానికి స్వస్తి పలకాలని మోదీ కోరారు. ఇదిలా ఉంటే మోదీ ప్రధాని అయ్యాక రష్యాలో ఇప్పటికే ఆరుసార్లు పర్యటించారు.

పుతిన్‌ అధ్యక్షతన బ్రిక్స్‌ సమావేశం..
రష్యాలో నిర్వహించే బ్రిక్స్‌ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాప్రికా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. సౌదీ అరేబియా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ బ్రిక్స్‌లో కొత్తగా చేరాయి. ఈ దేశాల ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు.

యుద్ధం ఆగేనా..
ఇదిలా ఉంటే.. జూలై 8న ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఆగస్టులో ఉక్రెయిన్‌ వెళ్లారు. ఇరు దేశాల అధ్యక్షులతో యుద్ధంపై చర్చించారు. యుద్ధం ఆపాలని కోరారు. దీంతో శాంతి చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరోమారు మోదీ రష్యా పర్యటన ఖరారు కావడంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు మోదీవైపే చూస్తోంది. గత పర్యటన సమయంలో మోదీకి రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ అండ్రూ ది అపోస్టల్‌తో సత్కరించింది. అవార్డు ప్రదానం చేసినందుకు గానూ పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.