Rajamouli’s Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ వసూలను రాబడుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన భారీ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. నిజానికి రాజమౌళి చేస్తున్న ఈ సినిమా కూడా బాహుబలి మాదిరిగానే రెండు పార్టులుగా తెరకెక్కబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా రెండు పార్టులుగా వస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే ఈ విషయం మీద రాజమౌళి స్పందించాల్సిన అవసరమైతే ఉంది. ఇక రీసెంట్ గా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేశామని జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతుంది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు…కానీ రాజమౌళి మాత్రం ఈ విషయం మీద ఏ రకంగానూ స్పందించడం లేదు. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుంది అనే దానిమీద ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసమే చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళు అనుకున్నట్టుగానే రాజమౌళి ఈ సినిమాను తొందరగా సెట్స్ మీదకి తీసుకెళ్ళి సినిమాను చిత్రీకరిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మహేష్ బాబు మాత్రం పొడుగు జుట్టుతో, పొడవాటి గడ్డంతో బాడీ కూడా చాలా బాగా బిల్డ్ చేసి మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆయనతో షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో తెలియాలంటే రాజమౌళి స్వయంగా వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సంవత్సరం నుంచి ఖాళీగా ఉండటం అనేది అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు రాజమౌళి కనక క్లారిటీ ఇస్తే పర్లేదు గాని లేకపోతే మాత్రం మహేష్ బాబు అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…